సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నయనతార – విఘ్నేష్ శివన్ ల జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట .. ఏడాది క్రితం జూన్లో గ్రాండ్గా వివాహం చేసుకుంది . మహాబలిపురం దగ్గరలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత సరోగసి ప్రాసెస్ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులై లైఫ్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు . కాగా నయనతార ప్రెసెంట్ నటిస్తున్న సినిమా జవాన్ .
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది . కాగా బాలీవుడ్ “బాద్ షా” కింగ్ షారుక్ ఖాన్ పథాన్ సినిమా తర్వాత ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టబోతున్నాడు ఈ సినిమాతో అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ కి డై హార్ట్ ఫ్యాన్ అయిన విగ్నేష్ శివన్.. ఈ సినిమాల్లో తన భార్య నయనతార నటనకు విగ్నేష్ ఫిదా అయిపోయాడు . సోషల్ మీడియా వేదికగా జవాన్ ట్రైలర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేశారు .
అయితే ఈ ట్వీట్స్ కి షారుఖ్ ఖాన్ రిప్లై ఇస్తూ ఫన్నీగా కౌంటర్ వేశారు . “విగ్నేష్ మా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు.. నయన్ చాలా టాలెంటెడ్ యాక్టర్స్.. ఓ నేను మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను .. ఓ భర్తగా మీకు అన్ని తెలుసు కదా.. అయితే నేను మాత్రం ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను . ఈ మధ్యనే ఆమె కొన్ని మేజర్ కిక్స్ – పంచెస్ నేర్చుకున్నారు ..సో జాగ్రత్తగా ఉండు బ్రదర్ ” అంటూ ట్వీట్ చేశాడు .
దీనికి విగ్నేశ్ కౌంటర్ ఇస్తూ..”చాలా జాగ్రత్తగా ఉన్నాను ..కానీ మీ ఇద్దరి మధ్య ఈ సినిమాలో బాగా డీప్ రొమాన్స్ ఉందని విన్నాను ..అఫ్కోర్స్ రొమాన్స్ రాజు దగ్గర నుంచి ఆ రొమాన్స్ నేర్చుకునింది “అంటూ షారుక్ ఖాన్ కి కౌంటర్ వేశాడు విగ్నేశ్.. దీంతో వీళ్ల ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి..!!