కేరళకు చెందిన నిత్యాశెట్టి మలయాళ టీవీ సీరియల్స్ తో మంచి పాపులర్ అయింది. ఆమెకు బుల్లితెరపై మంచి పాపులారిటీ వచ్చినా కూడా జల్సాల కోసం ఈజీ మనీకి అలవాటు పడింది. ఈ క్రమంలోనే తన స్నేహితుడు బిసుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరుపనంతపురంలో ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల వృద్ధుడుకు తన స్నేహితుడితో కలిసి వలవేసింది.
ఇళ్లు అద్దెకు కావాలన్న వంకతో ఆ సీనియర్ సిటిజన్ తో పరిచయం పెంచుకొని హనీ ట్రాప్ చేసి డబ్బులు గుంజే ప్లాన్ చేసింది. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికింది. కేరళకు చెందిన సీరియల్ నటి. న్యాయవాది నిత్య (32) అద్దె ఇల్లు కావాలంటే పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడిని తన ఇంటికి కూడా పిలిచింది. అక్కడ ఆమె ఆ వృద్ధుడిని హానీట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది.
ఆమె ఇంటికి వెళ్లిన వెంటనే అతడి ఒంటిపై ఉన్న దుస్తులు అన్నింటిని తొలగించింది. ఆ తర్వాత ఆమె తన ఒంటిపై ఉన్న దుస్తులు కూడా ఒక్కొక్కటిగా విప్పేసిందట. ఆ వెంటనే ఆమె స్నేహితుడు వచ్చి ఫొటోలు తీశాడట. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో ఆ వృద్ధుడు రు. 11 లక్షలు ఇచ్చినా కూడా రు. 25 లక్షలు కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారట.
చివరకు ఆ వృద్ధుడు రు. 25 లక్షలు ఇస్తానని నిత్య, బిసును తన ఇంటికే ఆహ్వానించి అక్కడే పోలీసులకు పట్టించాడు. దీంతో నిత్య, బిసు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు.