ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ నుండి ఇంత త్వరగా ఓ సినిమా వస్తుందని అస్సలు జనాలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసి పవన్ అభిమానులు కోరిక తీర్చేసిన సముద్రఖని ఈ సినిమా విషయంలో చేసిన తప్పు ఇప్పుడు అభిమానులకి కోపం తెప్పిస్తుంది . మొదటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం కొన్ని క్వాలిటీలు ఎక్స్పెక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
అయితే ఈ సినిమా విషయంలో మాత్రం సముద్రఖనీ పవన్ కళ్యాణ్ అభిమానులను కూసింత డిసప్పాయింట్ చేశారని చెప్పాలి . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబో అంటే కచ్చితంగా జల్సా సినిమా రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు . ఆ స్థాయి డైలాగ్స్ ని ఊహించుకుంటారు . అయితే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో మాత్రం ఆ స్థాయి డైలాగ్స్ లేనే లేవు . ఏదో అడపాదడపా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మెప్పించడానికి అలా రాశారు కానీ నిజానికి ఒరిజినల్ త్రివిక్రమ్ డైలాగ్స్ ఐతే అలా ఉండేటివి కాదు .
అది కూడా ఎలక్షన్స్ మూమెంట్ దగ్గరకు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్ త్రివిక్రమ్ ఎలాంటి డైలాగ్స్ రాస్తారో అంటూ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమాకి వెళ్లిన పవన్ అభిమానులు నిరాశ గాని వెనక్కి వచ్చారు. అయితే దీనంతటికి కారణం సముద్రఖని చేసిన తప్పే అంటూ తెలుస్తుంది . సినిమా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఆతృతలో త్రివిక్రమ్ కి అస్సలు టైం ఇవ్వలేదని .. ఆ కారణంగానే త్రివిక్రమ్ మంచి మంచి డైలాగ్స్ రాయలేకపోయారని చెప్పుకొస్తున్నారు. దీంతో సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ యావరేజ్ గా ఉండడానికి కారణం సముద్రఖ్నీ అని ప్రచారం జరుగుతుంది…!!