Moviesప‌వ‌న్ ' బ్రో ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ .. ఆ...

ప‌వ‌న్ ‘ బ్రో ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ .. ఆ సినిమాల కంటే త‌క్కువే…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ప‌వ‌న్ మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఈ సినిమాలో న‌టించ‌గా.. ప‌వ‌న్ బ్రో అనే దేవుడు క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌యం సీతం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. నిన్న రిలీజ్ అయిన బ్రోకు ఫ‌స్ట్ డే ఓ మోస్త‌రుగా అంచ‌నాలు వ‌చ్చాయి.

ఏపీ, తెలంగాణలో బ్రో ఫ‌స్ట్ డే 23.61 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే ప‌వ‌న్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇది త‌క్కువే. ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ అయితే ఫ‌స్ట్ డేనే ఏకంగా రు. 32 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. గ‌తేడాది వ‌చ్చిన భీమ్లానాయ‌క్ కూడా రు. 26.42 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఆ రెండు సినిమాల‌తో పోలిస్తే బ్రో ఫ‌స్ట్ డే వ‌సూళ్లు త‌క్కువే అని చెప్పాలి.

ప‌వ‌న్ చివ‌రి ఆరు సినిమాల ఫస్ట్ డే క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి..
బ్రో ది అవ‌తార్ – 23.61 కోట్లు
భీమ్లానాయ‌క్ – 26.42 కోట్లు
వ‌కీల్‌సాబ్ – 32.24 కోట్లు
అజ్ఞాత‌వాసి – 26.40 కోట్లు
కాట‌మ‌రాయుడు- 22.27 కోట్లు
స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – 21.70 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news