ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో,, వెబ్ మీడియాలో రామ్ చరణ్ – ఉపాసనల కూతురు క్లీంకార పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా మెగా అభిమానులు గత 11ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గుడ్ న్యూస్ ఫైనల్లీ రివీల్ చేసింది మెగా కోడలు పిల్ల ఉపాసన. రీసెంట్ గానే జూన్ 20వ తేదీ ఒంటిగంట 49 నిమిషాలకు పండు లాంటి మహాలక్ష్మి పాపకు జన్మనిచ్చింది. రీసెంట్గానే సాంప్రదాయ బద్దంగా మెగా వారసురాలకు “క్లీం కార” అనే నామకరణం కూడా చేశారు .
ఈ చిన్నారికి లలితా సహస్రనామంలోని పదాలు కలిసేలా అమ్మవారి ఆశీర్వాదాలు తో శక్తి చేకూరేలా ఈ పేరును పెట్టినట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించడం గమనార్హం . అంతేకాదు ఈ పేరుని స్వయాన ఉపాసన తల్లి శోభన తన కూతురికి పెట్టాలనుకున్నారట . ఆ టైంలో కలిసి రాక అదే పేరుని ఇప్పుడు “క్లీం కార” అంటూ తన మనవరాలికి పెట్టారు అన్న విషయం రీసెంట్ గానే రివీల్ అయింది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో #ఖ్ఖ్ఖ్అంటూ ట్రెండింగ్ మొదలైంది . కాగ రీసెంట్గా మెగా దంపతులు చరణ్ – ఉపాసన లు తమ బిడ్డ కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
పాపకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సైతం కేర్ఫుల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఉపాసన – రాంచరణ్ పాప ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగేలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు . చిన్నారి కోసం ఉపాసన ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ తో రెడీ చేయించారు . చిన్నపిల్లల మనసుకు ఏది నచ్చుతాదో అదే విధంగా చుట్టూ చెట్లు, బొమ్మలు అనిమల్స్ ఉండేలా ఈ గదిని డిజైన్ చేయ్యించింది. ఈ వీడియో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .
ఉపవిత్ర రాజారామ్ అనే ఆర్కిటెక్ట్ తో ఉపాసన ఈ డిజైన్ రెడీ చేశారు. ఉపాసన ఆమెకి తమ పాప కోసం ఫారెస్ట్ థీమ్ లో ఉండే డిజైన్ కావాలని కోరారట. పిల్లలు కోరుకునే విధంగా ఫారెస్ట్ లోనే వివిధ జంతువుల బొమ్మలు, చెట్లు ఉండే బోర్డులు, సాఫ్ట్ గా వైట్ థీమ్ లో ఉండే సోఫాలు మ్యాట్ లు, టేబుల్స్ ఇలా ఆహ్లాద భరితంగా గదిని డిజైన్ చేయించారు. సోఫాలు మాట్ టేబుల్స్ ఒకటి రెండు కాదు రూమ్ లోని ప్రతి చిన్న వస్తువు క్లీం కార మైండ్ ను పాజిటివ్ వేలో తీసుకెళ్లే విధంగానే డిజైన్ చేశారట. దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఉపాసనలు తమ పాప కోసం తీసుకున్న ఈ నిర్ణయం వైరల్ గా మారింది..!!