MoviesTL రివ్యూ: బ్రో … ప‌వ‌న్ బ్రో ఓకే

TL రివ్యూ: బ్రో … ప‌వ‌న్ బ్రో ఓకే

నటీనటులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, కేతిక శ‌ర్మ‌, ప్రియాప్ర‌కాష్ వారియ‌ర్‌, రోహిణి, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: థ‌మ‌న్ ఎస్‌
నిర్మాతలు: టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
దర్శకుడు : స‌ముద్ర‌ఖ‌ని
రిలీజ్ డేట్‌: జూలై 28, 2023
ర‌న్ టైం: 134 నిమిషాలు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా బ్రో ది అవ‌తార్‌. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌యం సీతం సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన బ్రోకు కోలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడు. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

TL స్టోరీ :
మార్కండేయ ( సాయిధ‌ర‌మ్ తేజ్‌) బాగా సెల్ఫీస్‌. త‌న స్వార్థం తాను త‌ప్ప ఎవ్వ‌రిని ప‌ట్టించుకోడు. చివ‌ర‌కు చెల్లి ఫీజు క‌ట్టాల‌న్నా కూడా స‌వాల‌క్ష కార‌ణాలు చెపుతుంటాడు. త‌న‌కు ప్ర‌మోష‌న్ వ‌స్తుంద‌ని.. తాను జీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు. అలాంటిది మ‌నోడు ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు. పైకి వెళ్లాక బ్రో దేవుడు ( ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) తో గొడ‌వ ప‌డ‌తాడు. తాను మ‌రి కొద్ది రోజులు బ‌తికేందుకు టైం ఇవ్వాల‌ని వేడుకుంటాడు. చివ‌ర‌కు ప‌వ‌న్ కండీష‌న్ మీద 90 రోజులు తిరిగి భూమ్మీద‌కు వ‌చ్చేలా ప‌ర్మిష‌న్‌ ఇస్తాడు. ఈ లోగా అత‌డు భూమి మీద చేయాల్సిన నులు అన్నీ చేసుకుని వ‌స్తాను అంటాడు. తిరిగి వ‌చ్చాక ఇటు చెల్లి పెళ్లి… అటు త‌న పెళ్లి, ఇటు అమ్మ‌కు ఆరోగ్యం బాగోక‌పోవ‌డం… ఇటు జీఎం అవ్వాల్సిన టైంలో ఉద్యోగం పోవ‌డంతో అనేక స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో ప‌డిపోతాడు. ఈ టైంలో బ్రో అత‌డిని ఎలా న‌డిపించాడు ? అత‌డి జీవితం ఎలా మ‌లుపులు తిరిగింద ? ఈ క‌థ ఏమైంది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

TL విశ్లేష‌ణ :
ప‌వ‌న్ – సాయి కాంబినేష‌న్లో ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే సీన్ల‌లో కావాల్సినంత కామెడీతో పాటు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప‌వ‌న్ చ‌నిపోయిన సాయిధ‌ర‌మ్‌కు 90 రోజుల టైం ఇవ్వ‌డంతో పాటు తిరిగి భూమ్మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు సాయితేజ్ ప‌క్క‌నే ఉంటూ సాయిని వాచ్ చేస్తూ క‌థ‌ను న‌డిపించ‌డం కాస్త సినిమాటిక్ లిబ‌ర్టీగా అనిపించినా చూడ‌డానికి బాగుంది. సెకండాఫ్‌లో వ‌చ్చిన ఆ యాక్ష‌న్ సీన్ కూడా బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టుగా ఉంది. సెకండాఫ్ అంతా కేవ‌లం ఎమోష‌న‌ల్ సీన్ల‌తోనే క‌థ‌ను న‌డిపిన తీరు బాగుంది. అయితే సినిమాలో ఎంద‌రో న‌టీన‌టులు ఉన్నా వారిని కాద‌ని మొత్తం ప‌వ‌న్‌, సాయి మీదే సినిమాను చుట్టేశారు. అయినా కూడా చూడ‌డానికి బాగుంది. సెకండాఫ్‌లో కుటుంబ స‌భ్యులు అంద‌రూ క‌లిసి మార్కండేయ‌ను మోసం చేయ‌డం… ఆ షాకుల‌తో సాయిధ‌ర‌మ్ స్ట‌న్ అయిపోవ‌డం ట్విస్టుల మీద ట్విస్టింగ్ అని చెప్పాలి.

ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్‌తో చంపేశాడు. దేవుడుగా సాయిధ‌ర‌మ్ తేజ్ వెన‌కే ఉంటూ పేల్చే డైలాగులు, పంచ్‌లు ఆ స్టైల్‌, ఆ మేజ‌రిజ‌మ్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇంకా చెప్పాలంటే మ‌నం త‌మ్ముడు, బద్రి, ఖుషీ స్టైల్ నాటి ప‌వ‌న్ మేరిజ‌మ్స్‌ను మ‌రోసారి చూశాం. ఈ వ‌య‌స్సులో కూడా ప‌వ‌న్‌లో ఎన‌ర్జిటిక్‌, ఆ ఛ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఇందులో ప‌వ‌న్‌కు హీరోయిన్లు, డ్యూయెట్లు లేక‌పోయినా ఊర‌మాస్ క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టేశాడు. భూమ్మీద‌కు వ‌చ్చిన ప్ర‌తి వాడు గెస్టే.. ఎప్పుడో ఒక‌ప్పుడు టైం అయిపోయాకే వెళ్లిపోవాల్సిందే.. అన్న డైలాగ్ ద‌గ్గ‌ర అంతే కాని మేం దోచేస్తాం.. అది చేస్తాం అని చిటికె వేస్తాడు. ఈ డైలాగ్ ఏపీ ప్ర‌భుత్వానికి త‌గిలిన‌ట్టుగా ఉంటుంది.

సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్లు ఎక్కువ‌వుతున్నాయ‌న్న టైంలో స‌డెన్‌గా ప‌వ‌న్ పాత సినిమాల్లో పాట‌లు ప్లే చేస్తూ డ్యాన్సులు వేయ‌డం.. ఎలివేష‌న్లు ఇవ్వ‌డం ఫ్యాన్స్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు జోష్ నింపింది. వినోద‌యం సీతం సినిమా మెయిన్ లైన్ తీసుకున్నా దానిని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేశారు. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ పార్ట్‌ను బాగా పెంచేసి బాగా క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు మ‌నం కొన్న టిక్కెట్‌కు అయితే డోకా ఉండ‌దు. సినిమాను బాగానే ఎంజ‌య్ చేస్తాం. అయితే మ‌రీ ఆహా ఓహో అనే రేంజ్‌లో క‌థ‌, క‌థ‌నాలు ఉండ‌వు. త్రివిక్ర‌మ్ మాట‌లు బాగున్నా.. స్క్రీన్ ప్లేతో అయితే మ్యాజిక్ చేయ‌లేదు. అందుకే సినిమాలో ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్స్‌ ఉండ‌వు.

ఇక్క‌డ స్క్రీన్ ప్లే థ్రిల్‌మిస్ అయ్యింది. సినిమా ఆద్యంతం ప‌వ‌న్‌ను హైలెట్ చేసేందుకు.. ప‌వ‌న్ హీరోయిం చూపించేందుకే స‌రిపోయింది. సినిమా మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే క‌థ‌లో పెద్ద మ‌లుపులు ఉండ‌వు. ప్లాట్‌గానే ఉంటుంది. ఎమోష‌న‌ల్ పార్ట్ ఎక్కువుగా ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల స్లో అయిన‌ట్టు ఉంటుంది. అది త‌ప్పా మేజ‌ర్ కంప్లైంట్లు లేవు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌న్ మ్యాన్ షో చేసేశాడు. ఈ సినిమాకు మెయిన్ ఫిల్ల‌ర్‌. కేవ‌లం 20 రోజుల కాల్షీట్ల‌తో ప‌వ‌న్ ఈ స్థాయి పాత్ర‌తో సినిమా చేయ‌డం గ్రేట్‌. ప‌వ‌న్ ఛ‌రిష్మా, క్రేజ్‌, జోష్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సాయిధ‌ర‌మ్ కూడా మార్కండేయ‌గా పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయాడు. యాక్సిడెంట్ త‌ర్వాత సాయిబాడీ షేఫ్‌లో మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. సాయి కాస్త లావెక్కిపోయాడు. హీరోయిన్ కేతిక‌శ‌ర్మ తో పాటు ప్రియ ప్ర‌కాష్ వారియ‌ర్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. వెన్నెల కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణితో పాటు సాయి త‌ల్లిగా రోషిణి పాత్ర‌ల‌తో త‌ళుక్కుమ‌న్నారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….
టెక్నిక‌ల్‌గా థ‌మ‌న్ నేప‌థ్య సంగీతంకు 200 మార్కులు వేయాలి. పాట‌లు అంత‌గా క్లిక్ కాలేదు. కానీ నేప‌థ్య సంగీతంతో మాత్రం అద‌ర‌గొట్టేశాడు. థ‌మ‌న్ నేప‌థ్య సంగీతంలో చాలా చోట్ల విశ్వ‌రూపం చూపించాడు. ఇక ఎడిటింగ్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. కొన్ని చోట్ల సీన్ల ప‌రంగా ల్యాగ్ అయిన‌ట్టు ఉన్నా అది ద‌ర్శ‌కుడు.. స్క్రీన్ ప్లే త‌ప్పిద‌మే త‌ప్పా ఎడిట‌ర్ త‌ప్పుకాదు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాణ విలువ‌లు సినిమాకు, క‌థ‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.

ఈ క‌థ‌కు బేసిక్‌గా భారీగా ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు.. రెమ్యున‌రేష‌న్ల‌కే చాలా బ‌డ్జెట్ పెట్టిన‌ట్టు ఉన్నారు. త్రివిక్ర‌మ్ మాట‌లు కొన్ని చోట్ల బాగా పేలాయి. గ‌ర్ల్‌ఫ్రెండ్సేమో తాగించేస్తారు. చెల్లెల్లేమో దించేస్తారు లాంటి మాట‌లు బాగున్నాయి. చాలా సీన్ల‌లో బెట‌ర్‌గా రాసుకునే అవ‌కాశం ఉన్నా కూడా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు లేదు. స్క్రీన్ ప్లే విష‌యంలో మాత్రం త్రివిక్ర‌మ్ మ్యాజిక్ పెద్ద‌గా ప‌నిచేసిన‌ట్టుగా లేదు. క‌థ‌ను ఇంకా ఆస‌క్తిక‌రంగా మ‌లుపులు తిప్పే అవ‌కాశం ఉన్నా దానిని యూజ్ చేసుకోలేద‌నిపిస్తుంది.

ఫైన‌ల్‌గా…
బ్రో ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. ఓ మ‌నిషి పుట్టుక‌, చావు మ‌ధ్య ప‌డే సంఘ‌ర్ష‌ణ‌లు ఎలా ఉంటాయి ? మ‌నిషి జీవితంలో ఎన్నో క‌ష్ట‌సుఖాలు ఎలా ? ఎద‌ర్కొంటాడ‌న్న క‌థాంశంతో ఈ సినిమా ఉంటుంది. చ‌నిపోయిన మ‌నిషికి 90 రోజుల మ‌ళ్లీ బ‌తికే అవ‌కాశం వ‌స్తే అప్పుడు త‌న కుటుంబ స‌భ్యుల సంబంధాలు, తాను నెర‌వేర్చే ప‌నుల మ‌ధ్య ఎలా ? న‌లిగిపోతాడ‌న్న‌ది బాగా ప్ర‌జెంట్ చేశాడు. ప‌వ‌న్, మెగాభిమానులు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చే ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రు ఒక్క‌సారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా హ్యాపీగా చూడొచ్చు. మ‌రి భారీ అంచ‌నాలు లేక‌పోతే బ్రో ది బెస్ట్ అంతే..!

బ్రో ఫైన‌ల్ పంచ్ : ఓకే బ్రో

బ్రో రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news