Newsహైదరాబాద్ అక్రమ ఆటిజం థెరపీ సెంటర్లపై అధికారుల ఎటాక్‌.. వాళ్ల గుండెళ్లో...

హైదరాబాద్ అక్రమ ఆటిజం థెరపీ సెంటర్లపై అధికారుల ఎటాక్‌.. వాళ్ల గుండెళ్లో రైళ్లు..!

ఆటిజం అనేది చాపక్రింద నీరులా చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తూ వారి తల్లిదండ్రులను, కుటుంబాలను తీరని వేదనకు గురిచేస్తున్న మందేలేని సెన్సోరియల్ సమస్య. ఇటువంటి పిల్లలకు ఉన్న ఒకే ఒక మార్గం ధెరపీ సర్వీసులు. అయితే ఈ స‌మ‌స్య‌కు థెర‌సీ చేసే సెంట‌ర్లు నిర్వ‌హించే వాళ్లు కూడా ధ‌నార్జ‌నో, లాభార్జ‌న‌తోనో చేస్తే అస‌లు ఈ చికిత్స‌కు చికిత్సే ఉండ‌దు.

కేవ‌లం ఆ పిల్ల‌ల‌ను త‌మ పిల్ల‌లుగా భావిస్తూ మ‌న‌సుతో చేస్తేనే ఆ థెర‌పీకి నూటికి నూరు శాతం న్యాయం జ‌రుగుతుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహించబడుతున్నటువంటి కొన్ని ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్లపై Kukatpally,Suchitra BK guda Dilsukhnagar ప్రాంతాలలో గత రెండు మూడు రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిన్న పిల్లలలో సెన్సోరియల్ సమస్యలు, ఎదుగుదల లోపాలు మరియు మానసిక రుగ్మతలకు సంబంధిచినటువంటి ఇబ్బందులకు శాస్త్రీయ పద్దతిలో మాత్రమే థెరపిస్ ఇవాల్సిఉంటుంది. ఈ విషయాలపై చాలా మంది నిపుణులు అనేకమార్లు హెచ్చరించడం తెలిసిన విషయమే. Sec – 52 RPWD Act 2016, ప్రకారం సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని మరియు వాటికీ అనుగుణంగా మాత్రమే ఇటువంటి థెరపిస్ ఇవాల్సిఉంటుందని అధికార్లుకూడా స్పష్టం చేశారు.

వీటి మీద సరయిన అవగాహన లేకుండా థెరపిస్ అనే పేరుతో చిన్నపిల్లల భవిష్యత్తుపైన విపరీతమైన ప్రభావం చూపిస్తుందని తెలిసిన తలితండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. ఈ అక్రమ సెంటర్ లపై సరిఅయిన చర్యలు తీసుకోవాలి అని నిపుణలు, తల్లిదండ్రుల కోరికల మేరకు అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం. దీంతో అక్ర‌మ థెర‌సీ సెంట‌ర్లు నిర్వ‌హిస్తోన్న నిర్వాహ‌కుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news