టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని తన సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న ఈ హీరో ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీలో నటిస్తున్నాడు . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్టుకి కమిట్ అయ్యాడు. ఇలాంటి క్రమంలోనే తారక్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు టృఎండ్ అవుతున్నాయి.
తారక్ ఎంత సాఫ్ట్ గా ఉంటాడు కోపం వస్తే అలాగే చెలరేగిపోతాడు. మనసులో ఒకలాగా బయటకి ఒకలాగా ఉండడం తారక్ కి తెలియదు.. ఆ విషయం అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం లైవ్ లోనే చూసాం . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు . ఒకానోక టైంలో తారక్ బిజీ షెడ్యూల్ కారణంగా విసికిపోయాడట.
జై లవకుశ సినిమా టైంలో ఆయన చాలా బాగా ఎక్కువ కోపం తెచ్చుకున్నట్లు చెప్పాడు. దానికి రీజన్ ఓవైపు జై లవకుశ షూటింగ్ .. మరోవైపు బిగ్ బాస్ సీజన్ వన్ షూటింగ్ ..చాలా ఇబ్బంది పడిపోయాడట . అంతేకాదు త్రీ క్యారెక్టర్స్ వేరియేషన్స్ చూపించాలి.. మరో పక్క బిగ్ బాస్ లో యాక్టివ్ గా ఉండాలి ..ఆయన వల్ల కాలేదట. అప్పుడు రావణాసురుడు కోపం కూడా రావణుడు లానే ఉంటుంది అంటూ రావణుడు కట్టలు తెంచుకున్న అగ్నిపర్వతంలా వస్తాడు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కమెంట్స్ చేశారు .
అన్ని క్యారెక్టర్స్ వేరియేషన్స్ చూపించలేక..ఆ సమయంలో నన్ను నేను ఏమనుకోవాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. “ఆ సమయంలో కుర్చీ తీసి తన తలపై నేనే కొట్టుకుందామా ..? అనేంతల కోపం వచ్చేసిందని కూడా చెప్పుకొచ్చాడు “. ప్రెసెంట్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!