ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఎలా ప్రవర్తిస్తున్నారో.. ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. తెలియకుండా అయిపోయింది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే అస్సలు అందాలు ఆరబోతల విషయంలో అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు . అంతేకాదు స్టార్ హీరో సినిమాల విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు
. కాగా తాజాగా అలాంటి ఓ చెత్త పని చేసి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది.
మనకు తెలిసిందే మృణాల్ ఠాకూర్ అంతకు ముందు సినిమాలో నటించిన పెద్దగా క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోలేకపోయింది. అయితే సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలో నటిస్తుంది . ఇప్పటికే చేతిలో నాలుగు బడా ప్రాజెక్ట్స్ పట్టుకొని ఉన్న మృణాల్ త్వరలోనే మరో రెండు సినిమాలను ఫైనలైజ్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .
ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ ఓ పెళ్లి అయిన హీరో ప్రేమలో పడిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఆయన మరి ఎవరో కాదు నాని. ప్రజెంట్ నానితో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే షూటింగ్ లో దగ్గరనుంచి ఆయనను గమనించిన ఈ బ్యూటీ..ఆయనతో ప్రేమలో పడిపోయిందట. అమ్మాయిలు తో బిహేవ్ చేసే పద్ధతి ..ఆయన చూపించే కేర్.. లవ్ ఎఫెక్షన్ కి ఫిదా అయిపోయిందట . పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వాడినే చేసుకోవాలని భీష్మించుకుని కూర్చుంటుందట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఇలాంటి అబ్బాయి కావాలి అనడం ఓకే ..ఇదే అబ్బాయి కావాలి అని రేపటి రోజు మొండి పట్టుదల పడితే అంజనా పరిస్థితి ఏంటో..? అంటూ రకరకాల మీమ్ తో ట్రోల్ చేస్తున్నారు..!!