Moviesసినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్.. సితార పాపకి అరుదైన గౌరవం.....

సినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్.. సితార పాపకి అరుదైన గౌరవం.. మహేశ్ ఫుల్ హ్యాపీ..!!

ఇది నిజంగా ఘట్టమనేని అభిమానులకి మంచి పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుని జనాలు ఎంతలా ఆదరించారో.. ఆయనని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో మనకు తెలిసిందే . కృష్ణ గారి తర్వాత ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకుని.. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరుగా రాజ్యమేలేస్తున్నారు .

పాన్ ఇండియా సినిమా చేయనప్పటికి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించుకున్న మహేష్ బాబు త్వరలోనే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నాడు . కాగా ఆయన కంటే ఆయన కూతురే ముందు ఆ క్రేజ్ సంపాదించుకునేసింది. ఎస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సితార నటించిన ఓ యాడ్.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు .

దీనితో సోషల్ మీడియాలో ఆ విజువల్స్ వైరల్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . ఓ నెల రోజుల క్రితం జరిగిన యాడ్ లో సితార పాల్గొనడం విశేషం . ఓ విధంగా చెప్పాలంటే ఇది రికార్డనే చెప్పాలి. ఇంకా టీనేజ్ లోకి రాకముందే ఆమె మోడల్గా కెరియర్ మొదలు పెట్టేసింది . దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు . ఇప్పుడు ఏకంగా ఆజ్యూవెలరీ యాడ్ అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ల ప్రదర్శించే సరికి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయిపోతున్నాయి . ఇదే ఫోటోలను వీడియోలను మహేష్ బాబు సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకొని తెగ సంబరపడిపోతున్నారు . ఒకవేళ ఇలాగే కొనసాగితే సితార త్వరలోనే హీరోయిన్గా కూడా ఏంట్రీ కన్ఫామ్ అని చెప్పొచ్చు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news