Movies"బెడ్ రూమ్ లో అలా ఉండటమే ఇష్టం"..పచ్చిగా చెప్పేసిన కంగనా...

“బెడ్ రూమ్ లో అలా ఉండటమే ఇష్టం”..పచ్చిగా చెప్పేసిన కంగనా రనౌత్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కంగనా.. పేరు చెప్పగానే అందరికీ గజగజ వణుకు వచ్చేస్తుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ కంగనా ను ఇష్టపడే జనాల కన్నా భయపడే జనాలే ఎక్కువమంది ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే అని చాలామంది జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలలో ఎన్నో స్టేజీలపై కంగనా ముక్కుసూటిగా మాట్లాడి ట్రోలింగ్కి గురైంది . అయినా సరే బాలీవుడ్ లో ఇంకా అరా కొరా అవకాశాలు అందుకుంటూ స్టార్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ రీసెంట్గా ఓ ఈవెంట్లో మెరిసింది . ఆరెంజ్ అండ్ పింక్ కలర్ గౌన్ ధరించి పార్టీకి హాజరైన కంగనా అక్కడున్న జనాలకు షాక్ ఇచ్చింది. ఆ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్నా.. చూడగానే అట్రాక్టివ్ గా ఉన్నా..అయినా కంగనా ఎందుకు ఇలాంటి డ్రెస్ ధరించింది అనేది ఎవరికి అర్థం కాలేదు .

తాజాగా సోషల్ మీడియా ఫ్యాషన్ ఇన్ఫ్లుయేన్సర్ డైట్ సభ్యా.. కంగనా అవుట్ ఫిట్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె వేసుకున్న డ్రెస్ తనకి అస్సలు నచ్చలేదని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. దీంతో కంగానా ఆ మాటలపై స్పందించింది. తనను ఎగతాళి చేసిన వారికి ఇచ్చి పడేసింది . “ఎందుకో తెలియదు నాకు ఇలాంటి బట్టలు నచ్చుతాయి ..నేను ఫ్యాషన్ను ద్వేషిస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు ..కానీ ఇండియన్ ట్రెడిషన్ బట్టలు అంటే చాలా ఇష్టం.. ఇండియా ఉత్పత్తులని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలని ఇలా చేస్తున్నాను . ఎక్కడ సంపాదించుకున్నామో అక్కడే ఖర్చు చేయడం మంచిది. అందుకే ఇలాంటి దుస్తులు ధరిస్తున్నాను ..పడుకునేటప్పుడు కూడా నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడమే ఇష్టం ” అంటూ ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చేసింది కంగానా…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news