Moviesనీహారిక విడాకులు.. వరుణ్ కి లావణ్య అమ్మ క్రేజీ కండీషన్.. అయోమయంలో...

నీహారిక విడాకులు.. వరుణ్ కి లావణ్య అమ్మ క్రేజీ కండీషన్.. అయోమయంలో నాగబాబు..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక డివోర్స్ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక రీసెంట్ గానే విడాకులు తీసుకుంది . జొన్నలగడ్డ చైతన్య తో గ్రాండ్గా వివాహం చేసుకున్న నిహారిక పెళ్లైన రెండేళ్లకి విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా నిహారిక ఫాస్ట్ కల్చర్ పడలేక జొన్నలగడ్డ ఫ్యామిలీ వదిలించుకుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే పెళ్లి తర్వాత నిహారిక చాలా అల్లరి చిల్లరిగా తిరిగింది. పార్టీలో పబ్బులు అంటూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది.

ఈ క్రమంలోనే ఓ రోజు డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కునింది. దీంతో అప్పటినుంచి చైతన్య ఫ్యామిలీకి నిహారికకు అస్సలు పడడం లేదని .. ఆ కారణంగానే చైతన్య ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఓ న్యుస్ వైరల్ అవుతుంది . అయితే నిహారిక విడాకుల వల్ల మెగా ఫ్యామిలీకి కొత్త తలనొప్పులే వచ్చి పడ్డాయి అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే రీసెంట్ గానే నిహారిక అన్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు . త్వరలోనే ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకోవడం లావణ్య కుటుంబానికి అస్సలు నచ్చలేదు . నిహారిక డివోర్స్ విషయం చెప్పగా ఓకే చేసిన లావణ్య ఫ్యామిలీ ..ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశాలను చూసి వరుణ్ కి క్రేజీ కండిషన్ పెట్టారట .” పెళ్లి తర్వాత నువ్వు- లావణ్య ఆ ఇంట్లో ఉండకూడదు దూరంగా ఉండాలి.. నిహారికతో కూడా ఎక్కువ సంబంధాలు ఉండకూడదు “అంటూ తగ్గేసి చెప్పిందట. అప్పుడే లావణ్య జీవితం బాగుంటుంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేయరని చెప్పుకు వచ్చిందట. అయితే అన్నా చెల్లెలిని విడతీయ్యడం ఎంతవరకు న్యాయమంటూ నాగబాబు ఫైర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్‌స్ నుండి నాగబాబు ఎలా బయటపడతారు అనేది ఆయనకే తెలియాలి ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news