పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉండాలి.. ఒక రేంజ్‌లో కుమ్మేయాలి. తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో రిలీజ్‌కు ముందు రోజు బుకింగ్స్ పరంగా లిస్ట్ చూస్తే టాప్ -10 సినిమాల్లో బ్రో సినిమా ప్లేస్ 9. దీనిని బట్టే ఈ సినిమా విషయంలో కామన్ ఆడియెన్స్ కాదు.. అసలు పవన్ ఫ్యాన్స్ సైతం ఎంత ఆసక్తితో ఉన్నారో తెలుస్తోంది
బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం.. టిక్కెట్లు టకటకా తెగిపోవాలి. అయితే హైదరాబాద్‌లో మాత్రమే కాదు ఎంటర్ నైజాంలో పరిస్థితి స్లోగా ఉంది. అసలు బుకింగ్స్ ఓపెన్ అయితే ఫస్ట్ వీక్ టిక్కెట్లు ఎప్పుడూ హాట్ కేకుల్లా క్లోజ్ అవుతాయి. అయితే ఇంకా ఫస్ట్ డే చాలా షోలకు చాలా ఖాళీలు ఉన్నాయి. ఇందకు ప్రధాన కారణం పవన్ క్రేజ్ తగ్గడం కాదు.. వరుణ దేవుడి ఎఫెక్ట్?
కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అయితే ఆగకుండా కుండపోత వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాలతో పాటు ఏపీలోని భారీ వర్షాలే ఉన్నాయి. అసలు జనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చూసేందుకు రావడం లేదు. ఈ టైంలో బ్రో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు.
ఈ క్రమంలోనే నైజాంలో బ్రో వసూల్లపై వరుణదేవుడి ఎఫెక్ట్ గట్టిగా పడేలా ఉంది. నిజానికి ఇది కమర్షియల్ మూవీ కాదు. ఓ మెసేజ్ మూవీ. సినిమాలో పవన్ దేవుడిగా కనిపిస్తాడు. పవన్‌కు హీరోయిన్ ఉండదు.. డ్యూయెట్స్ లేవు. అయినా రచయిత త్రివిక్రమ్ ఉన్నంతలో మేనేజ్ చేసేందుకు ట్రై చేశాడు. దేవుడితో లుంగీ కట్టించి.. మాస్ స్టెప్పులు వేయించాడు. చివరకు చేతికి బీడీ కూడా అందించాడు.
ఇంత చేసినా ఊహించని విధంగా వచ్చిన వర్షాలు బ్రోకు దెబ్బేశాయి. ఆ ఎఫెక్ట్ నైజాంతో పాటు హైదరాబాద్ ఓపెనింగ్స్‌పై గట్టిగా పడనుంది. అటు టికెట్ రేట్లు పెంచలేదు, మరోవైపు జోరుగా వానల దెబ్బతో బ్రో ఓపెనింగ్స్ బాగా డల్ అయ్యే ఛాన్సులే ఉన్నాయి.