ప్రజెంట్ కలియుగం రన్ అవుతుంది . 21వ సెంచరీలో మనం ముందుకు వెళ్తున్నాం . జనరేషన్ ఎంతలా మారిపోయిందో.. టెక్నాలజీ ఎంతలా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచమే మన చేతుల్లో ఉన్నంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచ దేశాలను చుట్టేయచ్చు..అన్న రేంజ్ కి ఎదిగిపోయింది ఈ లోకం . అయితే కాలం ఎంత మారినా.. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన .. ఇంకా జాతకాలు మూఢనమ్మకాలు అంటూ చాలామంది నమ్ముతున్నారు .
ఎక్కడికైనా వెళుతూ ఉంటే తుమ్మితే కొద్దిసేపు కూర్చొని వెళ్లాలని ..పిల్లి ఎదురొస్తే అపశకునమని ..బొట్టు లేని ఆడవాళ్లు ఎదురొస్తే దరిద్రం అంటూ చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు. అయితే మన ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కూడా ఇవి నమ్ముతారా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఇలాంటివి నమ్ముతాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ..మొదటి నుంచి ప్రభాస్ జాతకాలు పెద్దగా పట్టించుకోడు.. కష్టాన్ని నమ్ముకుంటాడు.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రభాస్ సడన్ గా జాతకాలు నమ్మడం ప్రారంభించారట . ఈ క్రమంలోనే ఆయన తన సినిమాల విషయంలో తన లైఫ్ విషయంలో ఒక జ్యోతిష్కుడు మాటలు ఎక్కువగా వింటున్నారట. ఆ కారణంగానే ప్రభాస్ ఆ జ్యోతిష్కుడు చెప్పిన డేట్ వరకు పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట . అంతేకాదు సినిమాల విషయంలో కూడా ఆయన చెప్పినట్లే తూచా తప్పకుండా పాటిస్తున్నాడట. దీంతో ఫ్యాన్స్ కోపడిపోతున్నారు . మీలాంటి స్టార్ హీరో కూడా జాతకాలను నమ్మితే ఇక లైఫ్‌లో ముందుకెళ్లడమే కష్టం బాసు అంటూ చెప్పుకొస్తున్నారు .మొత్తానికి ప్రభాస్‌కి కూడా జాతకం మూఢనమ్మకాలు అనే దోమ కుట్టేసింది . చూడాలి మరి ఇది నమ్మడం ద్వార ప్రభాస్ జాతకం ఎలా మారిపోతుందో..?