Newsఅయ్యయ్యో.. ఎన్టీఆర్ "దేవర"..మరో ఆది పురుష్ కానుందా..? కొరటాల అంత తప్పు...

అయ్యయ్యో.. ఎన్టీఆర్ “దేవర”..మరో ఆది పురుష్ కానుందా..? కొరటాల అంత తప్పు చేస్తున్నాడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎదురు చూస్తున్న సినిమాలలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కూడా ఒకటి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ సంబరపడిపోతున్నారు . కాగా ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది తెలుగు ఇండస్ట్రీలోకి జాన్వి కపూర్ .

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వికపూర్ . కాగా సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే దేవర సినిమాని పూర్తి రిస్క్ లో పెట్టబోతున్నాడు కొరటాల అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . మొదటి నుంచి కొరటాల ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీస్తూ ఉంటారు ..యాక్షన్ సీన్స్.. గ్రాఫిక్స్ తీసింది చాలా తక్కువ. అయితే దేవర సినిమా విషయంలో మాత్రం కొరటాల డేరింగ్ స్టెప్ వేసి మరి భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్ పెట్టబడుతున్నారట . అంతేకాదు ఫుల్ బాహుబలి స్టైల్ లో గ్రాఫిక్స్ కూడా క్రియేట్ చేయబోతున్నారట.

అయితే గ్రాఫిక్స్ లో కొరటాల కి నాలెడ్జ్ శూన్యం. ఇలాంటి క్రమంలోనే అసలు మనకు తెలియని దాని గురించి తెలియకుండా ఎలా వివరించగలం.. నీకు తెలియని పని గురించి నువ్వు ఎందుకు పెడుతున్నావు ..? అసలే ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ..? అని ఆలోచిస్తున్న టైం లో నువ్వు ఎన్టీఆర్ కెరియర్ ని రిస్క్ లో పెడుతున్నావు.. సినిమాని సినిమాగా తీసి హిట్ కొడితే నీకు మంచిది. ఎన్టీఆర్ అన్న కెరియర్ కు మంచిది ..కనీసం ఈ సినిమా విషయంలోనైనా చెప్పింది చెయ్ కొరటాల శివ అంటూ ఫ్యాన్స్ సజెషన్స్ ఇస్తున్నారు . అంతేకాదు కొంతమంది ఈ సినిమా తేడా కొడితే మరో ఆది పురుష్ లా మారిపోతుంది అంటూ కౌంటర్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దేవర సినిమా పోస్టర్స్ -హ్యాష్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news