టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేయాలని పిఆర్ టీంతో చెప్పిన విషయం తెలిసిందే . కాగా రీసెంట్ గాని సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొని అదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది సమంత . సినిమాలకు బ్రేక్ వేయడం పెద్ద నేరము కాదు.. పాపము కాదు .. కొన్ని కొన్ని సార్లు అది తప్పదు అంటూ చెప్పుకొచ్చింది . అయితే సమంత సినిమాలకు బ్రేక్ చెప్పడానికి కారణం ఆమెకు మయోసైటీస్ వ్యాధి మళ్లీ తిరగబడింది అని .. దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది .
ఈ క్రమంలోనే సమంత పూర్తి ఆరోగ్యవంతురాలుగా మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు . అయితే సమంత ఆరోగ్యం బాగోలేదు అంటూ సినిమాలకు బ్రేక్ చెప్పిన సరే తన సొంత వ్యాపారం మాత్రం వదలట్లేదు. ఎస్ ఆమె ఆరోగ్యం బాగోలేదు అంటున్న సరే సమంత సాఖీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ప్రమోట్ చేస్తుంది . రీసెంట్గా సాఖీ బ్రాండ్ న్యూ కలెక్షన్ ని ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో కొన్ని పోస్ట్లు పెట్టింది సమంత .నిజానికి సమంత ఇలా మామూలు టైంలో చేసుంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు..
కానీ ఆరోగ్యం బాగోలేదు అని తనకు ఎంతో ఇష్టమైన సినిమాలకు దూరం కాబోతుంది అని తెలిసి కూడా తన వ్యాపారాలను ఇలా ముందుకు తీసుకెళ్తుంది .. అంటే ఆమెకు డబ్బులు పరంగా ఇబ్బందిగా ఉందని .. ఆమెకి ఇప్పుడు డబ్బులు ఇచ్చే వారే లేరని ..అందుకోసమే ఆమె డబ్బు ఆమె సంపాదించుకోవడానికి ఇలా తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సమంత ట్రీట్మెంట్ ఖర్చు లక్షల్లోనే ఉంటుందని ..దానికి ట్రీట్మెంట్ .. మందులు చాలా కాస్ట్లీ అని కూడా చెప్పుకొస్తున్నారు . దీంతో సమంత పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . అయితే అక్కినేని ఫ్యామిలీ కోడలుగా ఉండి ఉంటే నీకు ఈ కర్మ పట్టేది కాదుగా అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా సరే సమంత ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటున్నారు మరి కొంతమంది అక్కినేని ఫ్యాన్స్…!!