Moviesవార్నీ..అప్పుడే అలాంటి రిస్క్ అయిన పనా..? ఇంత తొందరేంట్రా విశ్వక్‌సేన్...

వార్నీ..అప్పుడే అలాంటి రిస్క్ అయిన పనా..? ఇంత తొందరేంట్రా విశ్వక్‌సేన్ నీకు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కేవలం నటనే కాదు .. మిగతా వర్క్స్ లో కూడా వేలు పెడుతూ మల్టీ టాలెంటెడ్ హీరోలుగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . ఇదే క్రమంలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు ఓవైపు డైరెక్షన్ ..మరోవైపు ప్రొడ్యూసింగ్ మరోవైపు హోస్టింగ్లు చేస్తూ మల్టీ టాలెంటెడ్ హీరోస్ గా పాపులారి సంపాదించుకుంటున్న క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న విశ్వక్సేన్ సైతం అదే రూట్ లో ముందుకెళ్తున్నాడు.

ప్రజెంట్ సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తున్న విశ్వక్సేన్ ఎక్కువగా యూత్ ఫుల్- లవ్ – కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలోనే నటిస్తున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న “దేవర” సినిమాలో సైతం చిన్న రోల్ లో మెరువబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది . కాగా ఈ క్రమంలోనే విశ్వక్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విశ్వక్సేన్ . ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఓ షో కి పోస్టుగా వ్యవహరించనున్నాడని సమాచారం అందుతుంది .

ఈ షోలో మొత్తంగా 15 ఎపిసోడ్లు ఉంటాయని కూడా తెలుస్తుంది. అయితే ఇది టాక్ షో నా ..? లేక రియాల్టీ షో నా..? లేకపోతే మరేదైనా గేమ్ షో నా..? అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు . ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ టాక్ షో అని తెలుస్తుంది . అంతేకాదు ఆహా విశ్వక్సేన్ తో అదిరిపోయే రేంజ్ లో కామెడీ కూడా పండించబోతుంది అహా అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ని గుర్తు చేసే విధంగా విశ్వక్సేన్ షో కూడా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో విశ్వక్సేన్ పేరు వైరల్ గా మారింది . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇలా షోస్ చేయడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. కొందరు తొందర పడుతున్నాడు ఈ అబ్బాయ్ అంటూ కామెంత్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news