టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి మరో బిగ్ ఆఫర్ అందుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. కాగా ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ పడక అల్లాడిపోతున్న కృతి శెట్టి .. హిట్ కొట్టకపోయిన సరే అవకాశాలు వెతుక్కుంటూ కృతిశెట్టి గుమ్మం వైపు వస్తున్నాయి . దానికి రీజన్ అందం అనే చెప్పాలి . చూడడానికి చాలా చిన్నదైనా సరే చాలా అట్రాక్టివ్ గా ఉండడం ..ఆమెకు ప్లస్ పాయింట్ .
అంతేకాదు డైరెక్టర్ మేకర్స్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సాఫీగా షూటింగ్ పనులు పూర్తి చేయడంలో కృతిశెట్టి చాలా ముందు వరుసలో ఉంటుంది . అందుకే మేకర్స్ హిట్ కొట్టకపోయినా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు . కాగా ఇదే క్రమంలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ . కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న జీని సినిమాలో కృతి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది .
ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది . ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇందులో కృతిశేట్టి గ్రీన్ కలర్ సారీ.. సిల్వర్ కలర్ బ్లౌజులు చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి కూడా హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఒకప్పటి హీరోయిన్ దేవయాని కీలక పాత్రలో నటిస్తుంది. అర్జునన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా ఐసరి, కె గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు.