Moviesడెవిల్ టీజ‌ర్‌తోనే చంపేశాడు.. బింబిసార‌ను మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా ( వీడియో)

డెవిల్ టీజ‌ర్‌తోనే చంపేశాడు.. బింబిసార‌ను మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా ( వీడియో)

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇప్పుడు పలు భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ వెళుతున్నాడు. బింబిసార లాంటి డిప‌రెంట్ స‌బ్జెక్ట్‌తో హిట్ కొట్టిన క‌ళ్యాణ్‌రామ్ ఈ యేడాది ఇప్ప‌టికే అమిగోస్ అంటూ మూడు వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అమిగోస్ సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది.

ఇక ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమా క‌థ కూడా డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోన్న డెవిల్ ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా భారీ స్కేల్ లో రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది. ఈ రోజు టీజ‌ర్ రిలీజ్ చేశారు.

టీజ‌ర్ ఆద్యంతం అదిరిపోయింది. టీజ‌ర్ డైలాగులు అన్నీ హైలెట్‌గా నిలిచాయి. మీరు చెప్పేదానికి.. చేసేదానికి.. ఆలోచించేదానికి అస్స‌లు సంబంధం లేదు సార్‌.. మ‌న‌సులో ఉన్న భావ‌న మొఖంలో తెలియ‌కూడ‌దు.. మెద‌డులో ఉన్న ఆలోచ‌న‌.. మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డ‌కూడ‌దు.. అదే గూఢ‌చారికి ఉండాల్సిన ముఖ్య‌ల‌క్ష‌ణం.. అన్న డైలాగులు బాగా పేలాయి.

టీజ‌ర్‌తో నే బింబిసార రేంజ్ హిట్ క‌ళ డెవిల్‌కు వ‌చ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news