Moviesఛాన్స్ కోసం వెళ్తే కమిట్మెంట్ ఇవ్వమన్నారు.. జబర్దస్త్ రోహిణి సంచలన వ్యాఖ్యలు..!

ఛాన్స్ కోసం వెళ్తే కమిట్మెంట్ ఇవ్వమన్నారు.. జబర్దస్త్ రోహిణి సంచలన వ్యాఖ్యలు..!

కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెరపై సీరియల్ యాక్టర్ గా నటించిన రోహిణి తర్వాత బిగ్ బాస్ షోలో అవకాశాన్ని దక్కించుకుని తనదైన స్టైల్ లో దూసుకుపోయింది. ఈ షో ద్వారా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్‌బాస్‌లో ఆమె లేడీ డాన్‌లా వ్య‌వ‌హ‌రించింది. తరువాత జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా మారిన‌ రోహిణి తన టాలెంట్ తో టీం లీడర్ పొజిషన్‌కి చేరుకుంది.

ఓవైపు అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది రోహిణి. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ స్టార్టింగ్‌లో నేను ఆడిష‌న్ప్‌కి వెళ్ళినప్పుడు నాతో కమిట్ అవుతావా ? అంటూ అడిగారని దీంతో అక్కడి నుంచి వచ్చేసి ఎంతో బాధపడ్డాన‌ని తెలిపింది.

అయినా సినిమాపై ఉన్న ఇష్టంతో మళ్లీ మళ్లీ ఆడిషన్స్‌కు వెళెదానిన‌ని… మరోసారి ఆడిషన్స్ కి వెళ్లగా నా తండ్రి వయసు ఉన్న ఓ వ్యక్తి ఛాన్స్ ఇస్తా కానీ నాకేంటి ? అని అడిగాడని అక్కడ కూడా రిజెక్ట్ చేసి వచ్చేశా అంటూ వివరించింది. ఇలా చాలాసార్లు ఇలాంటి సిచువేషన్ ఎదుర్కొన్నా తాను ఎప్పుడూ తప్పుడు మార్గంలోకి వెళ్లలేదని డేరింగ్‌గా చెప్పింది.

నాకు టాలెంట్‌కి త‌గ్గ‌టు.. వచ్చిన అవ‌కాశాల‌తోనే సరిపెట్టుకున్నాను అంటూ వివరించింది. నేను ఈ పొజిషన్ లోనే ఉండాలి. ఇందులోనే నటించాలని గోల్స్ ఏమీ పెట్టుకోను అంటూ చెప్పుకొచ్చింది. రోహిణి తనుకు ఎదురైనా చేదు అనుభవాలను షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఆ కామెంట్స్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news