Moviesషాక్‌లో ఇండ‌స్ట్రీ… ఆ స్టార్ హీరో విడాకులు క‌న్‌ఫార్మ్‌…!

షాక్‌లో ఇండ‌స్ట్రీ… ఆ స్టార్ హీరో విడాకులు క‌న్‌ఫార్మ్‌…!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం వివాహం చేసుకోవడం విడాకులు తీసుకోవడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల చాలామంది స్టార్ సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో ఫర్ధీన్‌ ఖాన్ – నటాషా జంట విడాకులు తీసుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

బాలీవుడ్ సీనియ‌ర్ యాక్టర్ ఫర్ధీన్‌ ఖాన్ ప్రముఖ నటి ముంతాజ్‌ కూతురు నటాషాని 2005లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇస్సాబిల్లాఖాన్(10), అజారియాస్ ఫర్ధీన్ ఖాన్‌(6) ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
దాదాపు సంవత్సరం కాలం నుంచి వీరిద్దరూ మనస్ఫర్ధ‌ల‌ కారణంగా ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యనే వచ్చిన మనస్పర్ధలను పరిష్కరించుకునే నేపథ్యంలో ఇక కలిసి బతకలేమ‌ని నిర్ణయించుకున్నారట‌.

త్వ‌ర‌లోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. అయితే ఫర్ధీన్‌ ఖాన్ గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2005లో మేము వివాహం చేసుకున్నామని.. చాలా కాలం వరకు పిల్లలు లేకపోవడంతో 2011లో లండన్ షిఫ్ట్ అయ్యి అక్కడ సంతాన సమస్యల ట్రీట్మెంట్ తీసుకున్నామని ఐవిఎఫ్ ఫార్ములా ద్వారా నటాషా ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది అని డాక్టర్లు చెప్పడంతో మేము సంతోషించామ‌ని తెలిపాడు.

కానీ ఆమె ఆరో నెలలో అబార్షన్ జరగడంతో నటాషా డిప్రెషన్ కి వెళ్ళిపోయిందని కొంతకాలానికి పాప పుట్టిందని.. పాప పుట్టడంతో మా ఇద్దరి గుండెలు బరువు తగ్గాయని ఎంతో ఆనందంగా ఉన్నామని వివరించాడు. ఇక వీరిద్దరి విడాకుల నేపథ్యంలో ప్రస్తుతం ఫర్ధీన్‌ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2010 తర్వాత ఎటువంటి సినిమాల్లో నటించని ఫ‌ర్టీన్ ఇటీవల విస్ ఫెట్ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్‌తో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడ‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news