సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరోయిన్ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అమ్మడు అందరి హీరోల సరసన నటిస్తుంది . ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు రిలీజ్ అయింది రెండే కానీ ..ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి కారణం అమ్మడులోని మాస్ స్టైల్. ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేయగలిగే శ్రీలీల తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా తాపత్రయపడుతున్నారు.
దీంతో అమ్మడుకి కోట్లు ఇచ్చి కాల్ షీట్లు బుక్ చేసుకుంటున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీ లీల ఇంతమంది హీరోలతో నటిస్తుంది . కదా.. ఆమెకు ఏ హీరో ఫేవరెట్ అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల “తనకు చాలామంది హీరోలు నచ్చుతారని ..యాక్టింగ్ నచ్చుతుందని ..అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే ప్రాణం అని ..ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించాలనుకుంటున్నానని “చెప్పుకొచ్చిందట.
దీంతో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు ఉన్న సూర్యనే ఆమెకు ఫేవరెట్ హీరోగా మారడానికి మెయిన్ రీజన్ ఆయన నటించే స్కిల్స్.. ఆయన చేసే సేవా కార్యక్రమాలు అంటూ తెలుస్తుంది. శ్రీలీలకు సేవా కార్య క్రమాలు చేసే వాళ్ళు అంటే చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. మన ఇండస్ట్రీలో అలాంటి హీరోలు చాలా తక్కువ..!!