ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే నాగార్జున కొడుకు నాగచైతన్య మనసులు ఎవరో ఉన్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే నాగార్జున నే ఈ విషయం ఓపెన్ గా చెప్పుకు రావడం హైలైట్ గా మారింది . నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున నాగచైతన్య పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .
నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.” నాకు ఎందుకు డౌట్ మా వాడి మనసులో ఎవరో ఉన్నారు ..వాడు ఎవర్నో లవ్ చేస్తున్నారు.. అయితే ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పడం లేదు . లేటుగా పడుకుంటాడు ..ఇంటికి లేటుగా వస్తాడు .. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుంటారు ..వాడికి వాడే నవ్వుకుంటూ ఉంటాడు . అస్సలు అన్నం తినడు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటాడు. సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదు . ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేయడం లేదు.. నాకు ఇవన్నీ చూస్తుంటే మా వాడి మనసులో ఎవరో ఉన్నారు అని డౌట్ ఉంది . అందుకే నేను వాచ్మెన్ నిబ్ సైతం అడిగాను. అయితే వాచ్మెన్ కూడా ఏం చెప్పకుండా దాటేసాడు .
అంతే కాదు మా నుంచి దూరంగా వెళ్లాలి అని సపరేట్గా ఇల్లు కూడా తీసుకున్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నాగచైతన్య ఎవరినో లవ్ చేస్తున్నారు అని” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో నాగచైతన్య – సమంతల పెళ్లి కాకముందు ఇంటర్వ్యూ చెప్పిన మాటలు. దీనితో నాగచైతన్య – సమంత లవ్ మ్యాటర్ ముందే నాగార్జున పసిగట్టాడని ..కానీ ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం తెలియకుండా సైలెంట్ గా అయిపోయారని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పై నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!