కావాలనే చేస్తున్నారో.. లేక తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ..కొంతమంది వాంటెడ్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఈగోని టచ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా కారణంగా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతున్న ప్రభాస్ ని చూసి బాధపడిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ని మళ్లీ వేలు పెట్టి కెలుకుతున్నారు కొందరు పెద్దమనుషులు తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వివేక్ అగ్నిహోత్రి . ఈయన దర్శకత్వం వహించిన కాశ్మీరి ఫైల్స్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరెక్ట్ గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ బాక్సాఫీ దగ్గర ఫెయిల్ అవ్వగా చిన్న సినిమా కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో 100 కోట్లకు పైగా వసూలు సాధించింది . ఈ క్రమంలోనే చాలామంది ప్రభాస్ ని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు .
కాగా ఆ టైంలో వివేక్ అగ్నిహోత్రి కూడా ప్రభాస్ను ఏకీపారేశారు . అయితే తాజాగా మరోసారి డార్లింగ్ అభిమానులను హర్ట్ చేశాడు వివేక్ అగ్నిహోత్రి . “ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీకు కూడా దానిపై ఓ నమ్మకం అనేది ఉండాలి .. లేదంటే ఆ సబ్జెక్టులో ఎంతో కొంత ప్రావీణ్యమైన ఉండాలి.. అలా లేకపోతే ఎలా..? ప్రెసెంట్ దురదృష్టవశాత్తు భారత్ లో ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. రామాయణం మహాభారతం అంటే ఇతిహాసాలను కలిసి చేయాలనుకుంటే ఇది అంత ఈజీగా పూర్తవదు.”
“ఈ పురాణాలు వేల సంవత్సరాలుగా అందరూ మనసులో ముద్ర పడి ఉన్నాయి ..అంటే దానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. కొందరు స్క్రీన్పై వచ్చి నేనే దేవున్ని అని చెప్తే నిజంగా దేవుడు అయిపోతాడా..? రోజు రాత్రి ఇంటికి వెళ్లి ఫుల్ గా తాగేసి .. తెల్లారి వచ్చి దేవుడు గెటప్ వేసుకుని నన్ను నమ్మండి .. నేను మీ దేవుడిని అని చెప్తే ఎవరు నమ్మరు.. జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు కదా ..”అంటూ కూసింత ఘాటుగానే వ్యాఖ్యానించారు వివేకాగ్నిహోత్రి. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమాపై చేసిందని ప్రభాస్ ని ఈ రేంజ్ లో మండిపడడం ఆయనకు మొదటి నుంచి అలవాటేనని జనాలు చెప్పుకొస్తున్నారు . మరి కొందరు ఆయనకు పని పాట లేక ప్రభాస్ పై కామెంట్స్ చేసి స్టార్ గా మారాలని భావిస్తున్నారని రెబెల్ ఫాన్స్ సైతం కౌంటర్స్ వేస్తున్నారు..!!