Moviesవావ్: బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం.. హౌస్ లోకి వెళ్ళబోతున్న...

వావ్: బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం.. హౌస్ లోకి వెళ్ళబోతున్న స్టార్ క్రికెటర్..!!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాల్టీ షో గా స్టార్ట్ అయిన బిగ్బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా ఇప్పుడు త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఏడవ సీజన్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . ఎప్పుడు లేని విధంగా స్టార్ కంటెస్టెంట్స్ ని ఈ సీజన్లోకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే రెమ్యూనరేషన్ విషయంలో కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ అస్సలు తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతుందట . ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి అడిగిన దానికి డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తూ షోలో ఎలా నడుచుకోవాలో అన్న విషయం పై కూడా అవగాహన కల్పిస్తుందట.

కాగా ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ షోలో అడుగుపెట్టబోతున్నాడు ఇండియన్ స్టార్ క్రికెట్ అంటూ న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇదే జరిగితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్గా వేణుగోపాలరావు రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు . ఎస్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలరావును ఈ మెగా షోలకి తీసుకురావాలని స్టార్ మా గట్టిగా ప్రయత్నాలు చేస్తుందట . అందుకే ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడింది . అంతేకాదు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంచే విధంగా కూడా బిగ్ బాస్ ఆయన కు మాట ఇచ్చిందట.

అయితే ఇప్పటివరకు అన్ని భాషల్లో జరిగిన బిగ్ బాస్ షోలో ఏ సీజన్లోని క్రికెటర్ ఎంట్రీ ఇవ్వలేదు . ఒకవేళ నిజంగానే జరిగితే మాత్రం తెలుగు బిగ్ బాస్ సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు . కాగా భారత మాజీ క్రికెటర్ ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు 2019లో ఆటకు గుడ్ బాయ్ చెప్పాడు . క్రికెట్లోని అన్ని ఫార్మేట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ఆ సమయంలోనే ప్రకటించాడు. 2005 జూలైలో తొలి వన్డే ఆడిన అతని కెరియర్ల 10 నెలల వ్యవధిలోనే 16 వన్డేలకు పరిమితమై క్లోజ్ అయ్యిపోయింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news