Newsకొరటాల నెక్స్ట్ లిస్ట్ లో ఏ హీరోలు ఉన్నారో తెలుసా.. సక్సెస్...

కొరటాల నెక్స్ట్ లిస్ట్ లో ఏ హీరోలు ఉన్నారో తెలుసా.. సక్సెస్ అయితే మాత్రం దశ తిరిగిపోయిన్నట్లే..!!

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ ఎవరంటే మాత్రం అందరూ కళ్ళు మూసుకొని కొరటాల శివ అని చెప్తారు . కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తన కెరీర్ లో తీసిన ప్రతి సినిమాను భిన్న విభిన్నంగా తెరకెక్కించాలని చూస్తూ అదే కంటెంట్ ను తెరపై ఎక్స్ప్రెస్ చేసే కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో మాత్రం తప్పుటడుగులేసారు. కథ ప్రాబ్లమో.. డైరెక్షన్ ప్రాబ్లమో.. లేక కథలో ఎవరైనా వేరే వ్యక్తులు పుల్ల పెట్టారో.. అయితే తెలియదు కానీ.. ఆచార్య సినిమా అసలు కొరటాల స్టాండర్డ్స్ కి తగినది కాదు . ఆయన తెరకెక్కించిన సినిమానే కాదు అంటూ కొరటాల ఫ్యాన్స్ చెబుతున్నారు .

గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ..మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో తెరకెక్కించిన సినిమా చూస్తే ఖచ్చితంగా ఈ విషయం అందరికీ అర్థం అయిపోతుంది అంటూ కొరటాల శివ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . కాగా ఈ డిజాస్టర్ నుంచి బయటపడాలి అంటే కొరటాల ఇప్పుడు కచ్చితంగా ఒక హిట్ తన ఖాతాలో వేసుకోవాలి. ఆ సినిమా కోసమే ట్రై చేశాడు కొరటాల . ప్రజెంట్ కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవరా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5 – 2024న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను చకచకా కంప్లీట్ చేస్తున్న కొరటాల ఎన్టీఆర్ తో సినిమా అయిపోగానే నెక్స్ట్ కొందరు హీరోస్ ని లైన్ లో పెట్టుకుని ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కొరటాల శివ సినిమా చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్నారని ..దేవర సినిమా తీసి హిట్ కొట్టాకే వీళ్ళ ఇంటికి వెళ్లి కథ చెప్తారని భీష్ముంచుకుని కూర్చున్నాడట . కొరటాల శివ ఆచార్యతో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురి అయ్యాడు. మళ్ళీ దేవర సినిమాతో టాప్ డైరెక్టర్గా ఆ పొజిషన్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట . మొత్తానికి కొరటాల ఈసారి బాగా కసి మీద వర్క్ చేస్తున్నాడు. చూడాలి మరి ఎన్టీఆర్ దేవరతో కొరటాల ఎలాంటి హిట్ అందుకోబోతున్నాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news