ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా పోస్టర్స్ హాట్ టాపిక్ గా ట్రెండిగా మారింది . ఈ సినిమా కొద్దిసేపటికి గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. కాగా బ్యాక్ టూ బ్యాక్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కింది ఈ సినిమా. అయితే కొంతమంది కామన్ పీపుల్స్ మాత్రం ఈ సినిమా కామన్ గానే అనిపిస్తుంది.
ఇదివరకు చూసిన సినిమా లాగే ఉన్నాయి కానీ ఎక్కడ పెద్దగా వేరియేషన్స్ లేవని చెప్పుకొస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లోని ఆ బద్రీ సినిమా స్టైల్ కోసమైతే కచ్చితంగా సినిమా చూడొచ్చు అంటూ ప్రమోట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే ఈ సినిమాకి డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ నిర్వహించారు. కానీ తెర పై కధను వెనక నడిపించింది మొత్తం త్రివిక్రమ్ అంటూ ప్రచారం జరుగుతుంది . నిజానికి ఈ సినిమా కోసం సముద్రఖని కాలపురుషుడు అనే టైటిల్ ని రాసుకున్నారట . ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారట .
పవన్ కళ్యాణ్ కి సాయి ధరంతేజ్ కూడా బాగా నచ్చేసింది . కానీ లాస్ట్ మూమెంట్లో త్రివిక్రమ్ టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్న ఇది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదని వద్దని చెప్పారట . ఇది ఎమోషన్ తో సాగే చిత్రం ఇలాంటి చిత్రాన్ని అంత పవర్ఫుల్ టైటిల్ పడితే రాంగ్ వేలో వెళ్లి అంచనాలు పెంచినట్లు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేసినట్లు ఉంటుంది. అందుకే సింపుల్ అండ్ స్టైలిష్ గా క్యాచీ పదాలు వచ్చేలా బ్రో అనే టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ సజిస్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కూడా ఇదే ఓకే చేశారట . అలా కాలపురుషుడు సినిమా దగ్గర నుంచి బ్రో సినిమా టైటిల్ లాగా మారిపోయింది . మొత్తానికి త్రివిక్రమ్ ఆలోచనే బాగుంది. కాల పురుషుడు కన్నా బ్రో టైటిల్ నే బాగుంది అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఆ టైటిల్ పెట్టకుంద మమ్మల్ని బ్రతికించావ్ థాంక్స్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!