Movies"బేబీ" సినిమాలో నటించిన ఈ హీరో అనసూయకు ఏమవుతాడో తెలుసా.. గిన్నిస్...

“బేబీ” సినిమాలో నటించిన ఈ హీరో అనసూయకు ఏమవుతాడో తెలుసా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ . కాగా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఆనంద్ దేవరకొండ చరిత్రలోనే ఫస్ట్ టైం 23 కోట్లు క్రాస్ చేసిన మూవీగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. ప్రెసెంట్ 30 కోట్ల దిశగా దూసుకుపోతున్న బేబీ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

కాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్ర ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఈ సినిమాలో వీరాజ్ క్యారెక్టర్ . ఈ పాత్ర లేకపోతే అసలు వైష్ణవి – ఆనంద్ క్యారెక్టర్లకి వాల్యూ ఉండేది కాదు . అయితే ఈ పాత్రలో నటించిన వీరాజ్ బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే . తెరపై చాలా సైలెంట్ గా కనిపించే ఈ హీరో అనగనగా ఒక ప్రేమ కథ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఈ చిత్రానికి ఆయన దర్శకుడు కావడం విశేషం . అయితే ఈ సినిమాకి పెద్దగా సక్సెస్ కాలేదు .

ఆ తర్వాత అనసూయతో కలిసి థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నటించాడు . ఈ సినిమా నేరుగా ఓటీటీ లో రిలీజ్ కావడంతో అభిమానులకి జనాలకి ఇతగాడి పేరు పెద్దగా తెలియకుండా పోయింది. అయితే ఆ తర్వాత మనసానమః అనే షార్ట్ ఫిలిం ద్వారా రికార్డులు నెలకొల్పాడు. 15 నిమిషాలు నడివి ఉన్న ఈ షార్ట్ ఫ్లిలిం సంచలనాలు సృష్టించింది . ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది . అంతేకాదు ఈ స్థాయిలో అవార్డ్స్ తగ్గించుకున్న మొట్టమొదటి షార్ట్ ఫిలిం గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా చోటుచేసుకుంది . అయితే ఇంతటి స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నతెరపై మాత్రం చాలా సింప్లిసిటీగా నటించడం విరాజ్ స్పెషాలిటీ అని చెప్పాలి . దీంతో ఇతగాడిలో ఇంత టాలెంట్ ఉందా అంటూ అభిమానులు జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news