ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల మేటర్ వైరల్ అవుతుంది. కాగా ఇన్నాళ్లు మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. ఫైనల్లీ జొన్నలగడ్డ చైతన్యతో మెగా సంబంధం తెగిపోయింది . వీళ్ల విడాకుల పై నానారకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటికి తెర దించుతూ.. రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి విడాకులు కన్ఫామ్ అయినట్లు డాక్యుమెంట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్లిద్దరికి విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది . కాగా వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే వీళ్లిద్దరు ఇక కలిసి బతకలేమంటూ ఆరు నెలలు విడివిడిగా ఉంటూ.. కోర్టుకి నోటీసులు సబ్మిట్ చేశారట . ఈ క్రమంలోనే ఇద్దరి సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ విన్న కోర్టు.. ఇద్దరు దూరంగా ఉండటమే బెటర్ అంటూ తీర్పు ఇచ్చిందట . ఈ క్రమంలోని మెగా ఫ్యామిలీలో మరో డివర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది .
అయితే విడాకులు తీసుకున్న తర్వాత భరణం కింద భార్య.. భర్తను డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విడాకులు తీసుకున్న తర్వాత భర్త నుంచి భరణం తీసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే నీహారిక కూడా 100 కోట్లు డిమాండ్ చేసింది అని ప్రచారం జరిగింది. అయితే నిహారిక మాత్రం తన భర్త నుంచి ఒక్క రూపాయి భరణంగా వద్దు అంటూ తెగేసి చెప్పిందట. నా కాళ్ళ మీద నేను నిలబడి ఉంటాను.. నాకు వాళ్ళ దయాదాక్షణ్యాలు అవసరం లేదు అంటూ ముఖానే.. తెగేసి కోర్టులో ఒక్క రూపాయి భరణం వద్దు అంటూ తేల్చి చెప్పిందట . దీంతో మెగా ఆడపడుచుకి ఎంత పౌరుషమో అంటూ మెగా ఫాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు నీహారిక డబ్బు మనిషి కాదు అని తెలిసి..ఆమె డేర్ చూసి చైతన్య కి తడిసిపోయుంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క నిహారిక చైతన్య లాంటి మంచి హస్బెండ్ మిస్ అయింది అంటూ బాధపడుతున్నారు..!!