Moviesవాళ్లకి మూతి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన సాయిపల్లవి.. దిమ్మతిరిగిపోయిందిగా..!!

వాళ్లకి మూతి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన సాయిపల్లవి.. దిమ్మతిరిగిపోయిందిగా..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ వేయించుకుంది . అంతేకాదు తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయిన సాయి పల్లవి ఆఖరిగా నటించిన సినిమా గార్గి.

ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వలేకపోయింది . ఈ క్రమంలోనే కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరం కావాలి అనుకుంటుంది సాయి పల్లవి అని వార్తలు వినిపించాయి. అయితే వాళ్ళందరికీ మూతి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది సాయి పల్లవి. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ షేర్ చేసింది . కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. లోక‌నాయ‌కుడు కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తోంది. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, సిహెచ్.సాయి సినిమాటోగ్రఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ కాశ్మీర్లో జరుగుతుంది . దీంతో ఈ సినిమా షూట్ నుంచి కొన్ని పిక్స్ సాయి పల్లవి పోస్ట్ చేసింది . దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news