ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న జీవిత – రాజశేఖర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తర్వాత సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. వాళ్ళ కూతుర్లు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతున్న జీవిత రాజశేఖర్ల కూతుర్ల త్వరలోనే ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ కి ఎదుగుతారు అంటూ పలువురు సినీ ప్రముఖులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోని జీవిత రాజశేఖర్ లకు జైలు శిక్ష విధించింది నాంపల్లిలోని 17వ మెట్రోపాలిటీటిన్ కోర్ట్ .
ఎస్ పరువు నష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది . అంతేకాదు 5000 జరిమానా కూడా విధించింది. మనకు తెలిసిందే జీవిత రాజశేఖర్ కొంచెం దూకుడుగా మాట్లాడుతుంటారు . ఒకదాని గురించి తెలుసుకోకుండా ఆ టైంలో అనిపించింది మాట్లాడేస్తూ ఉంటారు అంటూ పలువురు జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . ఇదే క్రమంలో 2011లో రాజశేఖర్ తన భార్య జీవిత తో కలిసి మెగాస్టార్ చిరంజీవి రన్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్ పై అనుచిత ఆరోపదలు చేశారు . చిరంజీవి బ్లడ్ తీసుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
దీనిపై చిరంజీవి సైలెంట్ అయిన చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ చాలా సీరియస్ అయ్యారు. అప్పట్లో ఈ విషయమై జీవిత రాజశేఖర్లపై కోర్టులో కేసు కూడా వేశారు . ముఖ్యంగా చిరంజీవి పేరుతో నడుస్తున్న ట్రస్ట్ మరియు సేవా కార్యక్రమాలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా కేసు ఫైల్ చేశారు . ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల విచారణ తర్వాత రీసెంట్గా ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది . నాంపల్లిలోని 17వ మెట్రో పోలిటిన్ కోర్టు వీరిద్దరికి ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతోపాటు 5000 జరిమాన విధించింది. అంతేకాదు ఈ కేసు పై అపీల్ కి వెళ్లేందుకు ఛాన్స్ ఇస్తూ షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది . చూడాలి మరి దీనిపై రాజశేఖర్ జీవిత ఎలా రెస్పాండ్ అవుతారో..?