సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కచ్చితంగా వాళ్ళ నాన్న దగ్గర అమ్మ దగ్గర తన్నులు తినే ఉంటారు . మనలో కూడా చాలామంది చిన్నప్పుడు తెలిసి తెలియక తనంతో చేసిన తప్పులు కారణంగా ఇంట్లో భారీ స్థాయిలోనే దెబ్బలు తినే ఉంటాం. అయితే అలాంటి దెబ్బలు తింటేనే మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని మర్చిపోకూడదు. కాగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ సైతం తన తండ్రి చిరంజీవి చేత తన్నులు బాగా తిన్నారట .
మరీ ముఖ్యంగా చరణ్ ని ఎప్పుడు కొట్టని చిరంజీవి .. ఓ విషయంలో మాత్రం రూమ్ లోకి తీసుకెళ్లి బెల్ట్ తో వాయించి వదిలేసాడట. దానికి కారణం వాళ్ళ ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్ డ్రైవర్ వేరే వాళ్ళతో గొడవ పడుతున్న టైం లో బూతు పదాలను మాట్లాడడం . చరణ్ స్వయాన విన్న అదే పదాలను వచ్చి నాగబాబు వద్ద చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోని నాగబాబు – చరణ్ మాట్లాడిన మాటల గురించి చీరంజీవికి చెప్పగా కోపంతో ఊగిపోయిన చిరంజీవి రూమ్ లోకి తీసుకెళ్లి బెల్ట్ తో చితక్కొట్టేసాడట.
ఆ తర్వాత సారీ నాన్న ఇంకోసారి ఇలా చేయను అంటూ చెప్పుకొచ్చారట. అప్పుడు తిన్న దెబ్బ ఇప్పటివరకు ఆ ఛాన్స్ చిరంజీవికి ఇవ్వలేదు చరణ్ .. అన్ని విషయాల్లో గుడ్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు . రీసెంట్ గానే చరణ్ ఓ పాపకి తండ్రి అయ్యాడు . ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. “క్లీం కార” అంటూ పవిత్రమైన పేరును కూడా పెట్టుకోచ్చారు..!!