ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వల్గర్ కంటెంట్ ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు కథ కంటెంట్ ఉంటే సినిమా హిట్ అయ్యేది ఇప్పుడు అలా కాదు.. బోల్డ్ సీన్స్ ఉన్న బీప్ సౌండ్ పడిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. మరి ముఖ్యంగా లిప్ లాకులు.. బెడ్ సీన్స్ ఉంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారిపోతుంది . అంతేకాదు ఓటిటి ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు కొందరు డైరెక్టర్లు .
మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటిలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లల్లో ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన “Trial- లస్ట్ స్టోరీస్ 2- జీకర్దా”.. వెబ్ సిరీస్ లు మరింత దారుణంగా ఉన్నాయి . ఈ క్రమంలోనే రోజు రోజుకి ఓటీటీలో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . తాజాగా ఇదే విషయం పై రాజ్యసభ లో పెద్ద ఎత్తున చర్చలో జరిగాయి. కాగా ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలోనే కొత్త బిల్లులని ప్రవేశపెడుతున్నారు మంత్రులు . తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో పలు అంశాలు ఉండగా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ బిల్ పాస్ అయినా అనంతరం రాజ్యసభలోను బిల్ పెట్టి ప్రవేశపెట్టి పాస్ చేశారు .
ఇలాంటి క్రమంలోనే కొందరు మినిస్టర్లు ఓటీటీలో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందని మరింత దారుణంగా తయారైపోతున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు దీనిపై అనురాగ్ ఠాకూర్ కూడా స్పందిస్తూ ..ఓటిటి లో స్పాన్సర్స్ కు గట్టిగా ఇచ్చి పడేశారు. ” ఇకనుంచి ఓటీడీలో కంట్రోల్ తప్పిన ..హద్దులు మీరిన.. శృంగార సన్నివేశాలు.. బోల్ సీన్స్ పెట్టిన సెన్సార్ తీసుకొస్తామంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓటిటి సంస్థలతో సమావేశం జరిగిందని ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం అనే విషయాన్ని చెప్పుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు అవసరమైతే ఓటిటి కూడా సెన్సార్ తీసుకురావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!