టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది . అందానికి అందం నటనకి నటన.. అభినయానికి అభినయం అన్ని కలగలుపుని ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో దాదాపు మూడేళ్లపాటు బ్రేక్ తీసుకుంది. ఇప్పటికి స్టార్ హీరోయిన్గా తన హవాని కంటిన్యూ చేస్తుంది ..అంటే అనుష్క శెట్టి అంటే జనాలు ఎంత లైక్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాగా అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కల.. అది కూడా ప్రభాస్ ని చేసుకుంటే చాలా మంది సంతోషపడతారు.
ఈ గుడ్ న్యూస్ అనుష్క ప్రభాస్ ఎప్పుడు చెప్తారో వాళ్ళకే తెలియాలి. అయితే అనుష్క శెట్టికి ఉన్న అందం – ఓర్పు – సహనం – అణుకువ చూసిన ఓ స్టార్ట్ డైరెక్టర్ కోడలుగా చేసుకోవాలనుకున్నారట. ఆయన మరెవరో కాదు స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు . ఎస్ రాఘవేంద్రరావు అనుష్క శెట్టిను తన ఇంటికి కోడలుగా చేసుకోవాలి అనుకున్నాడట . తన కొడుకు ప్రకాష్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట . ఇంటికే తాంబులం తీసుకెళ్ళి మరి నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగాడట.
అయితే అనుష్క ఈ ఆఫర్స్ సున్నితంగా రిజెక్ట్ చేసింది . . నాకు అలాంటి ఒపీనియన్ లేదు అంటూ చాలా చాలా కూల్ గా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట అయితే ఆ తర్వాత ప్రకాష్ ముంబైకి చెందిన కనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ వీరు బ్రేకప్ చెప్పుకున్నారు . ఈ క్రమంలోని రాఘవేందర రావు .. అనుష్క అయితే నా కొడుకు జీవితాన్ని చక్కపెడుతుంది అంటూ భావించారట . అయితే విడాకులు తీసుకున్న అబ్బాయిని అనుష్క ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని క్లారిటీ కొచ్చి ఆ విషయాన్ని అక్కడితోనే ఆపేసుకున్నాడట . ఒకవేళ అనుష్క ఒప్పుకొని ఉంటే స్టార్ ఇంటికి కోడలుగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉండేది అంటున్నారు అభిమానులు..!!