Moviesబెల్లం చుట్టు ఈగలులా.. శ్రీలీల వెనుక స్టార్ హీరోలు తిరగడానికి కారణం...

బెల్లం చుట్టు ఈగలులా.. శ్రీలీల వెనుక స్టార్ హీరోలు తిరగడానికి కారణం ఇదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఇప్పటి వరకు చేసింది రెండంటే రెండు సినిమాలు. అయినా ఇండస్ట్రీలో దాదాపు పది సినిమాలను చేత్తో పెట్టుకొని టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . కాగ ఇలాంటి క్రమంలోనే ఎందుకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోలు సీనియర్ హీరోలు శ్రీ లీల వైపే వెళ్తున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే అందరూ శ్రీలీల ను ఇష్టపడడానికి కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడడమే అంటూ తెలుస్తుంది . మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లకు తెలుగు రాదు ..పక్కవాళ్ళు డబ్బింగ్ చెబుతారు . అయితే శ్రీ లీల బెంగుళూరు బ్యూటీ అయినా సరే తెలుగు చక్కగా అవలీలగా మాట్లాడేస్తుంది . తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అంతేకాదు శ్రీ లీల చీర కట్టిన మోడరన్ డ్రెస్ వేసిన రెండిట్లోనూ చాలా అందంగా కనిపిస్తుంది.

అందుకే స్టార్ హీరోల పక్కన యంగ్ హీరోల పక్కన సరిగ్గా మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా శ్రీ లీల ఇండస్ట్రీలో దూసుకుపోవడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు . మిగతా హీరోయిన్లు కొందరు స్టార్స్ పక్కన అస్సలు సెట్ అవ్వరు. అదేంటో తెలియదు శ్రీ లీల రోషన్ పక్కన ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో.. సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ పక్కన అంతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది . అందుకే శ్రీల అంటే పడి చచ్చిపోతున్నారు మన హీరోలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news