టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “జగడం” సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్లాడు . ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ.. కమిట్ అయిన సినిమాలను జాగ్రత్తగా తీసుకొచ్చి ..రిలీజ్ చేసి అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు .
ప్రెసెంట్ రామ్ పోతినేని – బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే మరో స్టార్ డైరెక్టర్ తో కూడా కథను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు మిగతా హీరోలకి ఈ మధ్యకాలంలో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఆడియో ఫంక్షన్ కి రావడం.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం ..టీజర్ ని ట్రైలర్ ని ప్రమోట్ చేయడం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు రామ్ పోతినేని కి ఎలాంటి హెల్ప్ అందిందే లేదు .
టాలీవుడ్ లో ఉండే ఏ స్టార్ హీరో కూడా రాంమ్ పోతినేనికి హెల్ప్ చేసిందే లేదు. అడపాదప బాలయ్య ఒక్కడే రామ్ పోతినేని కి హెల్ప్ చేసినట్లు దాఖలాలే ఉన్నాయి ..కానీ మిగతా హీరోలు ఆయన ముఖం కూడా చూడలేదు . ఈ క్రమంలోనే రామ్ పోతినేని అంటే ఎందుకు తెలుగు హీరోలకి పడదు ..ఎందుకు ఆయనని దూరం పెడుతున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రామ్ పోతినేని చాలా రిజర్వ్డ్ మైండ్ అని ..ఎవరితో పెద్దగా కలవడని ..తన పని తాను చూసుకో పోయే టైప్ అని ..పెద్దగా ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ చేయడని.. డైరెక్టర్ తో కూడా ఎక్కువ మింగిల్ అవ్వడని.. ఈ కారణంగానే ఇండస్ట్రీలో ఆయనని కొందరు హీరోలని దూరంగా పెట్టారు అంటూ సినీ వర్గాలల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!