ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా.. నటుడు విజయ్ వర్మ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా మేము డేటింగ్ చేస్తున్నాము అంటూ ఓపెన్ గా చెప్పుకున్న ఈ జంట .. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రిలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .ఈ క్రమంలోనే తమన్నా మదర్ విజయ్ వర్మ కు క్రేజీ కండిషన్ పెట్టింది అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
మొదటి నుంచి తమన్నాకు వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం . ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . అయితే విజయ్ వర్మను ప్రేమిస్తున్నాను అన్న విషయం మొదట ఆయనకంటే తన తల్లికే చెప్పిందట . ఈ క్రమంలోనే తల్లి కూడా విజయ్ వర్మతో మాట్లాడి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అంటూ ఉంటాయి అని చెప్పుకొచ్చిందట .
మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత తమన్నాను వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్లకూడదు అనే క్రేజీ కండిషన్ పెట్టిందట . అంతేకాకుండా తమన్నా ఎప్పుడు ఏడవకుండా చూసుకోవాలి అంటూ అందరి తల్లులు కోరుకునే విధంగానే చెప్పుకొచ్చిందట . అంతేకాదు లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి .. ఎట్టి పరిస్థితుల్లోను నా బిడ్డ చేయి నువ్వు వదలకూడదు. ..సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వార్తలు వచ్చిన సరే కానీ దాని కారణంగా డివర్స్ వరకు వెళ్ళకూడదు.. మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి అనేది రానివ్వకూడదు ..అలా ఉంటేనే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అంటూ చెప్పుకొచ్చిందట . దీంతో తమన్నా అమ్మగారి కండిషన్స్ కి విజయ్ వర్మ ఒప్పుకొని తమన్నాను భార్య గా చేసుకోవడానికి అంగీకరించారట..!!