Moviesఆదిపురుష్ లో అందమైన శూర్ఫణఖ..ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఆదిపురుష్ లో అందమైన శూర్ఫణఖ..ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఆదిపురుష్..సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ఒక్క సినిమా పేరే వినిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈ ఆదిపురుష్ సినిమా శుక్రవారం విడుదలైంది. మిక్సడ్ టాక్ తోనే ఈ సినిమా థియేటర్ లలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మొదటి రోజే 140 కోట్లు వసూలు చేసి ఈ సినిమా కొత్త రికార్డ్స్ ని సృష్టించింది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన మూడు సినిమాలు మొదటి రోజే 100 కోట్లు దాటడం విశేషం. అయితే ఈ సినిమాలో నటించిన పాత్రల గురించి సినిమాకి ముందు ఎక్కువగా ఎవ్వరికి తెలీదనే చెప్పాలి.

అయితే సినిమా విడుదలయ్యాక కొన్ని పాత్రల గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో రాఘవగా ప్రభాస్ నటించగా జానకిగా కృతి సనన్ నటించింది. వీరిద్దరూ ఈ పాత్రలను అద్భుతంగా చేశారనే టాక్ వచ్చింది. ఆ తరువాత హనుమాన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని, హనుమాన్ కి రాఘవ మధ్య మరి కొన్ని సీన్స్ ఉంటె ఇంకా బాగుందని టాక్ నడుస్తోంది. ఆదిపురుష్ సినిమాని ఓం రౌంత్ దర్శకత్వం వహించారు.

అయితే ఆదిపురుష్ సినిమాలో మరో పాత్ర గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ జోరందుకుంది. ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఇంతకి ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఇప్పుడు చూసేద్దాం.
రామాయణంలో ముఖ్యమైన పాత్రల్లో ఒకటి శూర్పణఖ. ఇది అందరికి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో శూర్పణఖ పాత్రలో నటించింది తేజస్విని పండిట్. ఇప్పుడు అందరు ఈ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. అందాల రాక్షసి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరి శూర్పణఖ పాత్రలో నటించిన తేజస్విని పండిట్ ఎవరో తెలుసా..బాలీవుడ్ లో ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆదిపురుష్ మూవీ ఎంతో క్రూరంగా కనిపించిన తేజస్విని పండిట్ రియల్ లైఫ్ లో స్టార్ హీరోయిన్. మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీలో తేజస్విని స్టార్ హీరోయిన్. 2004 లో వచ్చిన అగా బాయి అరేచా అనేమరాఠా అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆదిపురుష్ సినిమాలోనే కాదు ఆమె నటించిన ఫస్ట్ మూవీ లో కూడా నెగిటీవ్ పాత్రలోనే నటించింది.

వెండితెరపైనే కాదు బుల్లితెర ప్రేక్షకులను కూడా తేజస్విని మెప్పిస్తుంది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా తేజస్విని దక్కించుకుంది. ఇప్పుడు తేజస్విని వరుసగా వెబ్ సీరీస్ లో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంది. ఆదిపురుష్ సినిమాతో ఇప్పుడు తేజస్వినికి ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుందని టాక్ నడుస్తోంది.

ఆదిపురుష్ సినిమాలో శూర్పణఖ క్యారెక్టర్ లో అద్భుతంగా చేసిందని ఆడియన్స్ అంటున్నారు. రామాయణంలో శూర్పణఖ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె రామున్ని మోహించబడ్డే..లక్ష్మణుడితో పరాభవం జరగడం..ఆతరువాత రావణాసురుడు సీతన అపహరించడం జరిగిపోయింది. ఆ సమయంలో రాముడి సోదరుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తిరిస్తాడు. శూర్పణఖ పాత్రను ఆదిపురుష్ మూవీలో అద్భుతంగా చూపించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news