ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరూ కొన్ని కొన్ని అరుదైన వ్యాధులకు గురవుతున్నారు. రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత అతి అరుదైన వ్యాధి మయోసైటీస్ కి గురైన సంగతి తెలిసిందే. దీనికోసం సుదీర్ఘంగా ఏడు ఎనిమిది నెలలు పాటు కష్టపడి ఆ వ్యాధి నుంచి ఎట్టకేలకు బయటపడింది సమంత . అయితే ఇప్పటికే ఆ వ్యాధి కారణంగా అరాకొరా సఫర్ అవుతూ కొన్ని రోజులు ఇబ్బంది పడుతున్న సమంత ప్రెసెంట్ వరుస సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.
అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి సైతం అరుదైన వ్యాధితో బాధపడుతుంది అనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ విషయాన్ని స్వయానా అనుష్క నే చెప్పుకు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనుష్క ప్రెసెంట్” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు .
కాగ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క తనకు అరుదైన వ్యాధి ఉన్న సంగతిని బయటపెట్టింది . “తాను ఏదైనా సందర్భంలో నవ్వితే ..కంటిన్యూగా 10 – 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట . కంట్రోల్ చేసుకోవాలన్న ఆ నవ్వును కంట్రోల్ చేసుకోలేదట . కొన్నిసార్లు ఈ వ్యాధి కారణంగా సినిమా షూట్స్ ను కూడా బ్రేక్ కూడా వేసిందట. కంటిన్యూగా నవ్వడం వల్ల ఎన్నో లక్షలు ఖర్చు చేసి వేసిన సెట్స్ ని కూడా నా కోసం ఆ రోజు షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారని “చెప్పుకొచ్చింది . దీంతో అనుష్కకు ఉన్న అరుదైన వ్యాధి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఈ వ్యాధి గురించి తెలుసుకున్న జనాలు నవ్వేస్తున్నారు. ఇదేం వ్యాధి రా బాబోయ్ అంటూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!