Newsనరేశ్-పవిత్రల నుండి మరో సినిమా..? ఈసారి డైరెక్ట్ గా అదే..? తగ్గేదేలే...

నరేశ్-పవిత్రల నుండి మరో సినిమా..? ఈసారి డైరెక్ట్ గా అదే..? తగ్గేదేలే ..!!

ఎస్ .. అవునండి ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకునే పవిత్ర లోకేష్ – నరేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతూ సోషల్ మీడియాలో ఏకీపారిస్తున్నారు జనాలు . ఇంత వయసొచ్చాక వీళ్ళు పెళ్లి చేసుకుంటాను అంటుండడం సినీ జనాలకు సైతం ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. మనకు తెలిసిందే నరేష్ కి ఇది నాలుగో పెళ్లి అవుతుంది . ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చేశారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఇద్దరు కలిసి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన “మళ్ళీ పెళ్లి” సినిమాలో జంటగా కనిపించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది . కానీ నటన పరంగా మాత్రం పవిత్రకు – నరేష్ కు మంచి మార్కులే వేసింది. అయితే ఇది ఒరిజినల్ స్టోరీ కావడంతో జనాలు ఎవరు దీనిని లైక్ చేయలేకపోయారు . కానీ ఈసారి నరేష్ రూట్ మార్చినట్లు తెలుస్తుంది . “మళ్లీ పెళ్లి 2” అనే సినిమా ద్వారా మరోసారి తెర పై ఈ జంట కనిపించబోతున్నారట.

అయితే ఇది ఓ కల్పిత కధలా బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు పవిత్ర నరేష్ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ వాళ్లకు పిల్లలు పుట్టాక ..ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ..? పవిత్ర – నరేష్ ని సొసైటీ ద్వారా ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు..? కుటుంబ సభ్యులు వాళ్ళని ఎలా కుటుంబం నుంచి వెలివేశారు..? అప్పుడు పవిత్ర నరేష్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు..? సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రాకుండా ఎలా తొక్కేశారు..? అన్న కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట. దీంతో ఈ సినిమాపై మరో సరికొత్త చర్చ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. . “మళ్లి పెళ్లి” సినిమాతో ఫ్లాప్ అందుకున్న ఈ జంట “మళ్లీ పెళ్లి2” తో హిట్ అందుకుంటుందేమో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news