టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ కొద్దిసేపటి క్రితమే తండ్రి అయ్యారు . ఆయన భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్ తన ఫస్ట్ బేబీకి జన్మనిచ్చింది . తెల్లవారుజామున ఉపాసనకు బేబి గర్ల్ పుట్టిన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీనిపై మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వనప్పటికీ సన్నిహిత వర్గాల ద్వారా ఉపాసన పండంటి ఆడపిల్ల పుట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగ ఇదే క్రమంలో ఉపాసనకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అనే సంగతి అందరికీ తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ ఆమె కంట్రోల్లో ఉంటాయి. అయితే చాలామందికి ప్రెగ్నెంట్ అని తెలియగానే ఉపాసన బేబీని స్కాన్ తీసుకొని ఉంటుందని ..తనకి ముందే తెలుసు జెండర్ అంటూ చెప్పుకొచ్చారు .
ఈ క్రమంలోనే ఊప్సీ – ఆర్సి పార్టీ అంటూ ఉపాసన ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చిన పార్టీకి సంబంధించిన ఫొటోస్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఉపాసన ప్రెగ్నెన్సీ టైంలో తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చిన బిగ్ పార్టీలో ఉపాసన బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ని ధరించింది. అప్పుడే చాలామంది ఉపాసనకు బేబీ గర్ల్ అంటూ గెస్ చేశారు . చాలామంది పింక్ టీం తోనే ఆ ఫంక్షన్ ని ముందుకు తీసుకెళ్లడంతో ఉపాసనకి పుట్టబోయేది పాప అని .. ఆమె కు ముందే తెలుసు అని ..
అందుకే ఇలా బేబీ పింక్ కలర్ చూస్ చేసుకుందని లేడీస్ కి పింక్ కలర్ అంటే చాలా ఇష్టమని.. పిల్లలకి మరీ ఇష్టం అని ఆ కారణంగా ఈ ధీమ్ ని చూస్ చేసుకున్నారని వార్తలు వినిపించాయి. మరోసారి ఫైనల్లీ ఉపాసనకు బేబీ గర్ల్ పుట్టడంతో ఇప్పుడు అందరూ అదే విషయాన్ని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు . ఉపాసన డెలివరీకి ముందే స్కాన్ తీసుకుందని .. ఆమెకు జండర్ తెలుసని డెలివరీ ముందు లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుందని.. న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . చూడాలి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?