“ఝుమ్మంది నాదం” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన తాప్సి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మొదట్లో చాలా బొద్దుగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాలో అవకాశాల కోసం భారీగా బరువు తగ్గింది . తద్వారా ఆమె అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తాప్సి.. తనదైన స్టైల్ లో దూసుకుపోతూ బాలీవుడ్ లో కి వెళ్లి సినిమాలు చేసింది .
ప్రజెంట్ బాలీవుడ్లో బోల్డ్ రోల్స్ అన్నా.. లేడీ ఓరియంట్ ఫిలిమ్స్ అన్న తాప్సి తలుపులు తడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈ క్రమంలోని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆమె బాలీవుడ్ కి వెళ్లడానికి మెయిన్ రీజన్ ఆమె ప్రేమ విఫలం అవ్వడమే అంటూ తెలుస్తుంది . అప్పట్లో ఈ న్యూస్ లు తెగ వైరల్ అయ్యాయి . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకుని అమ్మడు తెగ ప్రేమించిందట .
ఆ హీరో కూడా ప్రేమించాడు అంటూ చెప్పుకొచ్చాడట . అయితే తీరా వీళ్ళిద్దరూ కలిసి తిరిగాక హీరో హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడట . దీంతో ఆ బాధను భరించలేక తాప్సి ఇండస్ట్రీ నుంచి పక్క భాష ఇండస్ట్రీకి వెళ్లిపోయింది అంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. అయితే దీనిపై తాప్సి ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. బాలీవుడ్ లో మాత్రం విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తుంది బోల్డ్ బోల్డ్ రోల్స్ చేస్తూ వస్తుంది తాప్సీ..!!