నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయింది . ఓ ఒకప్పుడు గంటకు పోస్ట్ పెట్టే రష్మిక మందన ..ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే లేదు . అంతేకాదు జనాలకు ఎక్కడ టచ్ లో కూడా లేదు . అమ్మడుకు సంబంధించిన విషయాలు కూడా బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే రష్మిక మందనాలో ఇంత భారీ మార్పు రావడానికి కారణం ఏంటా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
అయితే ప్రజెంట్ రష్మిక మందన పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉందని .. అక్కడ సిగ్నల్స్ ఉండవని .. ఆ కారణంగానే అమ్మడు సోషల్ మీడియాకి దూరంగా ఉంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే మరి కొంత మంది అమ్మడు విజయ్ దేవరకొండ తో బ్రేకప్ అయిందన్న వార్తలు వినిపించినప్పటి నుంచి దూరంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు విజయ్ దేవరకొండతో బ్రేకప్ కాలేదు అంటూ రీసెంట్ గానే ఆనంద్ దేవరకొండ సినిమా పాటను రిలీజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ ను ప్రూవ్ చేసుకుంది .
అయినా సరే ఎక్కడో రష్మిక – విజయ్ దేవరకొండ మధ్య ఎడబాటు అనేది ఇంకా ఉండనే ఉంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు రకాల వార్తల ద్వారానే విజయ్ -రష్మిక ల మధ్య గ్యాప్ పెరిగిందని.. అందుకే సోషల్ మీడియాని ఇద్దరు దూరం పెట్టేసారని చెప్పుకొస్తున్నారు . మరి కొంతమంది ఏది ఏమైనా ఈ భారీ మార్పు మంచిదే ..సోషల్ మీడియా వల్ల విడిపోతున్న జంటలు ఎక్కువైపోతున్నాయి అంటూ రష్మిక ని సపోర్ట్ చేస్తున్నారు..!!