Moviesబాహుబ‌లి, స‌లార్ స్టైల్లో రాజ‌మౌళి - మ‌హేష్ సినిమా... ఎన్టీఆర్ కూడా...

బాహుబ‌లి, స‌లార్ స్టైల్లో రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా… ఎన్టీఆర్ కూడా ఉన్నాడోచ్‌…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి – సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు ? స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ అభిమానుల‌తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళి బాహుబ‌లి, స‌లార్‌, పుష్ప స్టైల్ ఫాలో అవుతున్నాడ‌ట‌.

అదేంటి పై మూడు సినిమాల‌కు ఈ సినిమాకు లింక్ ఏంట‌నుకుంటున్నారా ? ఎస్ పై మూడు సినిమాల్లాగానే ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తెర‌కెక్కించ బోతున్నాడ‌ట‌. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. ఈ భారీ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మొదటి పార్ట్ లో మహేష్ హీరోగా, రెండో పార్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడని అంటున్నారు.

ఇప్ప‌టికే ఎన్నెన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసుకుంటూ.. ప్ర‌తి సినిమా విష‌యంలో ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా వ‌స్తోన్న రాజ‌మౌళి ఇప్పుడు ఈ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌ను రెండు పార్టులుగా తెర‌కెక్కించ‌డం.. ఒక్కో పార్టులో ఒక్కో స్టార్ హీరోను తీసుకోవ‌డం నిజంగానే గ్రేట్‌. ఇక సూపర్‌ స్టార్ పుట్టినరోజు అయిన ఆగస్ట్ 9న ఈ సినిమాను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేశ్‌.. త్రివిక్రమ్‌ సినిమా గుంటూరు కారంతో బిజీ ఉన్నాడు. న‌వంబ‌ర్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి… అనంతరం రాజమౌళి సినిమాపైకి వెళ్లనున్నాడు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా కోసం రాజ‌మౌళి తండ్రి, స్టార్ స్టోరీ రైట‌ర్ విజయేంద్రప్రసాద్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారని.. ముఖ్యంగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని వార్తలు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news