Movies"ప్రభాస్ గురించి మీరు అనుకునేదంతా నిజం కాదు".. టాప్ సీక్రేట్ ను...

“ప్రభాస్ గురించి మీరు అనుకునేదంతా నిజం కాదు”.. టాప్ సీక్రేట్ ను రివీల్ చేసిన కృతిసనన్..!!

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రెబెల్ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే నిన్న తిరుపతిలో గ్రాండ్గా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్ . ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన సీత దేవి పాత్రలో నటించిన కృతి సనన్ మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది .

అంతేకాదు ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్స్ ని కూడా రివీల్ చేసింది . స్టేజి పైకి వచ్చిన కృతి సనన్ మాట్లాడుతూ..” ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం ..ఇంకా మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ఆది పురుష్ సినిమా అద్భుతమైన ఓ దృశ్య కావ్యం . కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. మీరందరూ అనుకున్నట్లు ప్రభాస్ చాలా సైలెంట్ పర్సన్ ఏం కాదు ..మంచిగా మాట్లాడుతాడు ..చాలా అల్లరి చేస్తాడు. తనకి దగ్గర అయితే ఎంత మాట్లాడతాడో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు”.

“అంతేకాదు ప్రభాస్ మంచి ఫుడి బాగా తింటాడు . చాలా సరదా సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా అన్నిటికన్నా హార్డ్ వర్కర్..ఈ సినిమాలో కొన్ని సీనన్స్ కోసం ఎంత కష్టపడ్డాడో.. అది చూసిన జనాలు ఆశ్చర్య పోవాల్సిందే . ఈ సినిమాలో ప్రభాస్ నటన చాలా బాగుంటుంది. మీరందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ” అంటూ ప్రభాస్ ను ఓ రేంజ్ లో పొగిడేసింది “. దీంతో సోషల్ మీడియాలో కృతి సనన్ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news