టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ సీతమ్మ దేవి పాత్రలో కనిపించబోతుంది . అంతేకాదు ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న తిరుపతిలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి గెస్ట్ గా వచ్చి తమ బ్లెస్సింగ్స్ ను ప్రభాస్ కి ఆదిపరుష్ టీం కి అందజేశారు . అయితే ఇదే టైంలో ప్రభాస్ స్పీచ్ ఇస్తున్న క్రమంలో డార్లింగ్ ఫాన్స్ అందరు పెళ్లెప్పుడన్నా పెళ్లెప్పుడు అంటూ కేకలు అరుపులతో రచ్చ రంబోలా చేశారు . ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం తన పెళ్లి పై చిరునవ్వుతో స్పందించారు . “పెళ్ళే కదా చేసుకుంటాను.. తిరుపతిలోనే కచ్చితంగా చేసుకుంటాను ” అంటూ క్రేజీ హింట్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి వైరల్ గా మారింది . ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని అది కూడా తిరుపతిలోనే అని.. అందుకే అంత పక్కాగా చెప్పేసాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే అమ్మాయి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అనుష్క శెట్టినా..? లేకపోతే మరెవరైనా అమ్మాయి నా..? అది ప్రభాస్ చెప్తేనే బాగుంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!