సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు రావాలంటే కొందరు డైరెక్టర్లను..ప్రొడ్యూస్రలను సుఖ పెట్టాల్సిందే అన్న కామెంట్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కేవలం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్స్ కాదు .. ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న అందాల ముద్దుగుమ్మలను కూడా ఇదేవిధంగా టార్చర్ చేస్తారు అన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ కి గురి అవ్వాల్సిందే అన్న కామెంట్లను మరోసారి ప్రూవ్ చేసింది హీరోయిన్ తాప్సి.
ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో “ఝుమ్మంది నాదం” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా దూసుకుపోయిన తాప్సి.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్లి ఎలాంటి రోల్స్ చేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్న బోల్ట్ ఫిలిమ్స్ అన్నా అందరు తాప్సి ఇంటికి వెళ్తున్నారు.
అంతలా తన పేరుని మార్చేసుకుంది. రీసెంట్గా తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఏ విధంగా చూస్ చేసుకుంటారు అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ” ఏదైనా ఒక సినిమాలో పాత్రలు కావాలంటే ఆ డైరెక్టర్లు – హీరోలు తమకు తెలిసిన వారిని ..తమ బంధువులను చూస్ చేసుకుంటారు.. అందుకే టాలెంట్ ఉన్న నటీనటులను తొక్కేస్తున్నారు . ఆ కారణంగానే ఇండస్ట్రీ ఇలా మారిపోయింది “అంటూ ఓపెన్ చెప్పేసింది. గతంలో కూడా ఆమె మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అవకాశాలు రావాలి ..లేకపోతే ఆ డైరెక్టర్లు .. ఆ హీరోయిన్ మొఖం కూడా చూడడని “చాలా బోల్డ్ గా స్పందించింది . దీంతో ప్రజెంట్ హీరోయిన్ తాప్సి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!