Moviesఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ అంటే అంత ఇష్టమా..? ఆయన బర్త...

ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ అంటే అంత ఇష్టమా..? ఆయన బర్త డే గిఫ్ట్ గా ఏం ఇచ్చారో చూడండి..ట్రూ ఫ్రెండ్ షిప్ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు . స్టార్ డైరెక్టర్ హీరోస్ – హీరోయిన్స్ – ప్రొడ్యూసర్స్ – ఎంతోమంది సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా మంచి ఫ్రెండ్షిప్ ను హెల్తీ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో కొత్త ఫీలింగ్ ను కలగజేస్తున్నారు. వాళ్ళల్లో ఒకరే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ..ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ని చార్జ్ చేస్తున్నారు.

అలాగే ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని వరుసగా పాన్ ఇండియా హీరోలతో ప్రాజెక్టులను కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో షేక్ చేస్తున్నాడు . రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తన బర్త డే ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు . ఈ క్రమంలోనే సలార్ సినిమా సెట్స్ లో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు .

అంతేకాదు మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం ప్రశాంత్ నీల్ కి ఎంతో ప్రేమగా విష్ చేశారు . నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ అంటూ చాలా ప్రేమగా ఆప్యాయంగా ట్విట్ చేశారు . అయితే ప్రశాంత్ నీల్ అంటే ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ అందరికన్నా డిఫరెంట్ గా విష్ చేశారు . తనకి ఎంతో ఇష్టమైన నాటుకోడి కూరను స్వయంగా తన చేతులతో వండి మరి పంపించారు .

దీంతో సర్ప్రైజ్ గా ఫీల్ అయిన ప్రశాంత్ నీల్ ఆయన భార్య ఫొటోస్ ని షేర్ చేస్తూ థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ “థాంక్యూ అన్న” అంటూ నోట్ చేసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్ అంటే ఇంత ఇష్టమా..? రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా ..కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్ ఎవరైనా ఇస్తారు.. కానీ ప్రేమతో ఇలా వండి పెట్టడమే నిజమైన ప్రేమ .. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news