Newsనిశ్చితార్ధం అయిన వారానికే లావణ్య కి భారీ ఝలక్ ఇచ్చిన ...

నిశ్చితార్ధం అయిన వారానికే లావణ్య కి భారీ ఝలక్ ఇచ్చిన వరుణ్.. మెగా అభిమానులు షాక్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పేర్లు ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరు సంపాదించుకున్న ఈ ఇద్దరు జూన్ 9న గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు . అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు యమ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ వీడియో ఒకటి హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. వరుణ్ తేజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాడో చెప్పేసాడు.

వరుణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “గాండీవదారి అర్జున”. ఈ సినిమా పై బోలెడు అంచనాలు పెట్టుకుని ఉన్నాడు మెగా హీరో . ఆగస్టు నెల 25వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోని సోలో హీరోగా కెరియర్ ప్రారంభించి సరైన సక్సెస్ అవుతున్న వరుణ్ తేజ్ .. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని కోరుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో వరుణ్ తేజ్ ని హోస్ట్ ప్రశ్నిస్తూ ఉన్న క్రమంలో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పుకొచ్చారు . ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ఒక రోజంతా ఉండాలి అంటే.. ఏ హీరోతో ఉంటారు అన్న ప్రశ్నకు ” కళ్యాణ్ బాబాయ్” తో అంటూ ఖతర్నాక్ ఆన్సర్ ఇచ్చాడు వరుణ్ . అంతేకాదు ఎవరితో అయినా మీరు పోటీ పడాలనుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు ..”నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు.. నేను ఎవరితోనూ పోటీ పడాలని కోరుకోను.. నేను ఎప్పుడు నా తో నాకే పోటీ అనుకుంటూ ఉంటాను “అంటూ చెప్పుకొచ్చారు .

అంతేకాదు ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తారు అని ప్రశ్నించగా..” రమ్యకృష్ణ గారితో డేట్ కి వెళ్ళాలని కోరికగా ఉంది . ఆమెకు చిన్నప్పటినుంచి నేను బిగ్ ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయాలని ఆశపడుతున్నానని చెప్పుకొచ్చాడు . ఇదే క్రమంలో అప్పటికే లావణ్యతో డేటింగ్ లో ఉన్న వరుణ్ .. ఆమె పేరు చెప్పకుండా రమ్యకృష్ణ పేరు చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news