Moviesస్టార్ హీరో మహేశ్ బాబు కి కూడా ఈ తిప్పలు తప్పట్లేదే.....

స్టార్ హీరో మహేశ్ బాబు కి కూడా ఈ తిప్పలు తప్పట్లేదే.. అంత సినీ ఇండస్ట్రీ మాయ..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో రచ్చ లేపుతున్నారు సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా పైకి ఎదుగుతున్నారు అంటే .. ఆయన లాగేసే దానికి నలుగురు కింద కాచుకొని ఉంటారు . కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే కాదు ఏ రంగమైన ఇది సర్వసాధారణం ..కామన్ ..ఇలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబుని కావాలనే కొందరు ఆకతాయిలు పని కట్టుకుని ట్రోల్ చేస్తున్నారు .

“గుంటూరు కారం” సినిమా విషయంలో ఉన్నవి లేనివి గాసిప్ లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో “గుంటూరు కారం” సినిమాకి సంబంధించిన నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్న ఆకతాయిలు .. ఈ మధ్యకాలంలో మహేష్ బాబుకి సంబంధించిన పలు ఫ్యామిలీ విషయాలను సైతం ట్రోల్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తన కూతురితో కనిపిస్తున్న దృశ్యాలను ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు . మహేష్ బాబు ఎంత స్టార్ హీరో అయినా తన కూతుర్ని హీరోయిన్గా చేయడానికి నానా తండాలు తిప్పలు పడుతున్నారని .. అందుకే ఏ డాన్స్ ప్రోగ్రాం కి వెళ్ళినా ..ఏ షోకి వెళ్లిన ..ఏ ఈవెంట్ కి వెళ్ళినా.. ఏ బర్త్డే పార్టీ కి వెళ్లి నా… కూతురు సితారని వెంటపెట్టుకొని వెళ్తున్నారని .. ఆమెకు సంబంధించిన వీడియోస్ నీ ట్రెండ్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు.

రీసెంట్గా మహేష్ బాబు – సితార ఘట్టమనేని దిల్ రాజు కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. కాగా ఈ పార్టీలో మహేష్ బాబు ప్రతి ఒక్కరికి తన కూతురు సితార ని పేరు పేరున పరిచయం చేయడమే కాకుండా బాగా మింగిల్ అయ్యి హై రేంజ్ లో కలిసిపోయారు. జనరల్ గా మహేష్ బాబు ఆ టైప్ కాదు . పార్టీకి వెళ్ళామా..? అటెండెన్స్ వేయించుకున్నామా..? వచ్చామా..? కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో మహేష్ బాబు లో చాలా చేంజెస్ వచ్చాయి . దానంతటకీ కారణం కూతురు సితార ని స్టార్ హీరోయిన్గా చూడడానికి అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news